Hyderabad

News May 7, 2025

HYDలో కరెంటును కంటిన్యూగా వాడేస్తున్నారు

image

HYDలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో మీటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 24న 3795 మెగా వాట్లను వినియోగించగా ఈ ఏడాది అదే రోజు 4,170 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఏప్రిల్ 23 2024లో 3,745 మోగా వాట్లు వినియోగించగా ఈ ఏడాది 4,136 వాడారు. ఈ వారం, పది రోజుల్లో వినియోగం ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.

News April 25, 2025

HYD: సెలవుల్లో జూపార్క్‌ చుట్టేద్దాం..!

image

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.

News April 25, 2025

 స్కూల్ విద్యార్థులకు ఓయూలో ఇంగ్లిష్ క్లాసస్

image

8, 9,10 విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి. రోజూ ఉదయం 8.15 నుంచి 9.45 వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు 7989903001 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

News April 25, 2025

HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

image

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.

News April 25, 2025

శిథిలావస్థలో హైదరాబాద్ చారిత్రక సంపద

image

పాతబస్తీలోని పురాతన భవనం పత్తర్‌గట్టి భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత నెలలో పెచ్చులూడి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1911లో నిర్మించిన ఈ హెరిటేజ్ భవన సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని స్థానికులు చెబుతున్నారు. చార్‌కమాన్ల ఆధునీకరణలో భాగంగా 2009లో కేవలం రెండింటికి మాత్రమే మరమ్మతులు చేశారని తెలిపారు. HYD చారిత్రక సంపదను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.

News April 25, 2025

HYD: 2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

image

HYD స్థానిక సంస్థల MLC సీటు MIM కైవసం చేసుకుంది. అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ జులై 26 1977లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో నూర్ బజార్, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేల కోటా MLCగా శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా 40 ఓట్లు కలిగిన MIM గెలుపు ఖాయమైనప్పటికీ, GHMCలో బలం పుంజుకుంటున్న బీజేపీ తమదే గెలుపనడంతో ఈ ఎన్నికపై కాస్త అసక్తి నెలకొంది.

News April 25, 2025

HYD: విద్యార్థులూ.. ఈ నంబర్లకు కాల్ చేయండి

image

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. త్వరలో 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఎగ్జామ్‌లో పాసైన వారి సంగతి అటుంచితే ఫెయిల్ అయిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారికి భరోసా ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మానసిక వేదనకు గురవుతున్న వారు ఈ నంబర్లకు 7893078930, 04066202000, 9493238208, 9152987821, 14416  కాల్ చేయండి. వీరి సూచనలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.

News April 25, 2025

HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

image

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.

News April 24, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడి సంపులో పడి వ్యక్తి మృతి

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్‌ పడిపోయింది. ఫోన్‌ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 24, 2025

HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

image

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.