India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఎండ 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను దాటేసింది. ఇబ్రహీంపట్నం, MCపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో నిన్న 40-42 డిగ్రీలవరకు నమోదైంది. 27వ తేదీ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని TGDPS తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సా.4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని IAS అరవింద్ కుమార్ సూచించారు. గొడుగులు, టోపీలు వాడటంతో పాటు అధికంగా పానీయాలు తాగాలన్నారు.
HYDలో ఎండలు దంచికొడుతున్నాయి. G+1 భవనం, పెంట్ హౌస్, రేకుల ఇంట్లో ఉండే మధ్య తరగతి, పేదవాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీలింగ్, టేబుల్ ఫ్యాన్ ఉన్నా ఉపశమనం లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కూలర్లు, ACలకు డిమాండ్‌కు తగ్గట్లే ధరలున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బుల్లేక EMI దిక్కు అయ్యిందని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. స్థోమత లేని పేదోడు షాపులో కొనలేక, ఇంట్లోనే సర్దుకుపోతున్నాడు.
లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.
22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.
HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.
ఉస్మానియా యూనివర్సిటీ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన 3వ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.
ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో BRS సభ్యులెవరూ ఇప్పివరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకే నేతలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికకు మరో 2 గం. వ్యవధి ఉంది. ఫిబ్రవరిలో GHMC స్టాడింగ్ కమిటీ ఎన్నికకు BRS దూరంగా ఉండగా మరోసారి HYD స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి తప్పుకుంది. రాష్ట్రవ్యాప్తంగా BRSకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ GHMCలో మాత్రం ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.
ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో BRS సభ్యులెవరూ ఇప్పివరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకే నేతలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికకు మరో 2 గం. వ్యవధి ఉంది. ఫిబ్రవరిలో GHMC స్టాడింగ్ కమిటీ ఎన్నికకు BRS దూరంగా ఉండగా మరోసారి HYD స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి తప్పుకుంది. రాష్ట్రవ్యాప్తంగా BRSకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ GHMCలో మాత్రం ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.
HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.68% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది.
గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.