Hyderabad

News July 2, 2024

HYD: హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు

image

హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాలు.. దొమ్మరపోచంపల్లికి చెందిన ముజాహిద్ ఆలియాస్ ముజ్జు(50), నవాబ్ కుంటకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్(40) స్నేహితులు. ఇద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా గొడవలు అయ్యాయి. సయ్యద్ ఇస్మాయిల్‌ను ముజాహిద్ తన స్నేహితులు పాషా(25), ఫిరోజ్ ఖాన్(31)తో కలిసి హత్య చేశారు. నేరం రుజువు కాగా శిక్ష పడింది.

News July 2, 2024

HYD: పరీక్ష ల్యాబ్ లా నూతన భవనం ప్రారంభం

image

రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

News July 2, 2024

HYD: బస్సులు సరిపడా లేక ప్రజల అవస్థలు..!

image

HYD, ఉమ్మడి RRలోని పలు ప్రాంతాలకు బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడపాలని కోరుతున్నారు. ఐటీ కారిడార్, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్ ప్రాంతాలకు ఒకే బస్సు ఉంది. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సు రాగానే దాని వెంట పరుగులు తీసి మరి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీ ప్రాంతాల్లో ఉందా కామెంట్ చేయండి.

News July 2, 2024

HYD: రేపే ఇంటర్వ్యూ.. ఉద్యోగం పొందే ఛాన్స్..!

image

RR జిల్లా వెస్ట్ రీజియన్ 17 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు జులై 3న చిలుకూరులోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో ఉదయం 9 గంటలకు డెమో ఇంటర్వ్యూ తరగతులు జరగనున్నాయి. పీజీ, బీఈడీ, BNM, BPED,BLIC చేసినవారు అర్హులు కాగా..తెలుగు,హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, పౌర, సాంఘిక,జంతు,వృక్ష, ఆర్థిక, రసాయన శాస్త్రాల్లో పోస్టులు ఉన్నాయన్నారు.

News July 2, 2024

HYD: ఒక్క రోజు వ్యవధిలో 15 మంది ఆత్మహత్య

image

HYD, ఉమ్మడి RRలో వివిధ కారణాలతో ఒక్క రోజు వ్యవధిలో 15 మంది సూసైడ్ చేసుకున్నారు. శంషాబాద్‌లో విష్ణు, జవహర్‌నగర్‌‌లో శ్రావణి, జగద్గిరిగుట్టలో సయ్యద్ దిలావర్, నాగోల్‌లో రాకేశ్ మాలిక్, అబిడ్స్‌లో ఇందూరాణి, శేఖర్, డబీర్‌పురలో యూనుస్, బాలాపూర్‌లో ముషారఫ్, ఫిలింనగర్‌లో నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌లో నర్సింగ్, బొల్లారంలో అఖిల్, వికారాబాద్ జిల్లాలో శివానంద్, చందన, రాములమ్మ, వెంకటేశ్ చనిపోయారు.

News July 2, 2024

HYD: గ్రూప్-4 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ

image

HYD తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ కమిషన్ కార్యాలయంలో గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగింది. HYD, RR, MDCL, VKB సహా ఇతర జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంత మంది అభ్యర్థులు పూర్తి దరఖాస్తులు తీసుకురాకపోవడంతో, అధికారులు పలు సూచనలు చేసి, వారికి తగిన సమయం కేటాయించారు.

News July 2, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలంటూ 8.90 లక్షల స్వాహా

image

ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

News July 2, 2024

BREAKING: HYD: 5 స్కూల్ బస్సులపై కేసు నమోదు

image

హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News July 2, 2024

HYD: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి వంశీకృష్ణ(19) HYD హయత్‌నగర్ శాంతినగర్‌లో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2 రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RR జిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

News July 2, 2024

HYD: రాంగ్ రూట్‌లో వచ్చిన 18 బైక్‌లు సీజ్

image

రాంగ్ రూట్‌లో వచ్చిన 18 బైక్‌లను HYD గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ యూటర్న్ వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులు బైకర్లను అడ్డగించారు. కొత్త చట్టం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఇది గచ్చిబౌలి పీఎస్‌లో కొత్త చట్టం ప్రకారం నమోదు చేసిన మొదటి కేసు అని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.