Hyderabad

News August 5, 2024

HYD: ఎస్సై ఉద్యోగం లక్ష్యం.. ప్రాణాలు తీసిన గొడవ

image

క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో <<13779327>>యువకుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NLGకి చెందిన వెంకటేశ్ రైతు బిడ్డ. అంజయ్య గౌడ్, వెంకటమ్మలకు నలుగురు ఆడపిల్లల తర్వాత వెంకటేశ్ ఐదో సంతానం. SI ప్రిపరేషన్ కోసం LBనగర్లో ఉంటూ రాత్రి పాకెట్ మనీ కోసం క్యాబ్ నడిపేవాడు. ఈ క్రమంలోనే రూ.200 కోసం జరిగిన ఘర్షణలో వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎకరంన్నర పొలం అమ్మి వైద్యానికి రూ.2 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు.

News August 5, 2024

HYD: రూ.200 కోసం గొడవ.. రెండేళ్లు నరకం

image

రూ.200 కోసం మొదలైన గొడవతో యువకుడి ప్రాణం పోయింది. పోలీసుల ప్రకారం.. NLG జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 జులై 31న వివేక్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిల్ రూ.900 కాగా రూ.700 ఇవ్వడంతో గొడవైంది. వివేక్ 20 మంది స్నేహితులతో వెంకటేశ్‌పై దాడి చేశాడు. రూ.2కోట్ల మేర ఖర్చు చేసినా రెండేళ్లపాటు మంచాన పడ్డ వెంకటేశ్ ఆదివారం మృతిచెందాడు.

News August 5, 2024

HYD: షాద్‌నగర్ ఘటనపై సీఎం సీరియస్

image

బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

News August 5, 2024

వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరణకు కృషి: గవర్నర్

image

వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ(ఇండియన్ జర్నలిస్టు యూనియన్) డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3, 4వ తేదీల్లో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సెషన్‌కు ఆదివారం చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ బండారు దత్తాత్రేయ భరోసా కల్పించారు.

News August 5, 2024

HYD: నేటి నుంచి శుభకార్యాలు షురూ

image

మూడంతో 3 నెలలు నిలిచిన శుభకార్యాలు నేటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో HYD, RRలో వివాహాది కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. దీంతో ఈ నెల రోజుల పాటు ఎటుచూసినా సందడి వాతావరణమే నెలకొననుంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు ముస్తాబుకానున్నాయి.

News August 5, 2024

HYD: నవంబర్ నెలలో అంబర్పేట వంతెన ప్రారంభం!

image

HYD నగరంలో నవంబర్ నెలలో అంబర్పేట వంతెనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు HYD ప్రాంతానికి వచ్చాయన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నవంబర్ నెలలో ప్రారంభించి 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

News August 4, 2024

HYD: చదువుకుంటూనే నాలుగు ఉద్యోగాలు సాధించిన తులసి

image

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ నల్లగొండకు చెందిన చింతల తులసి ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించిన తులసి.. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలకు సన్నద్ధమవుతూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది.

News August 4, 2024

HYD: 3ఏళ్లలో బెంగళూరును అధిగమిస్తాం: మంత్రి

image

IT ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.

News August 4, 2024

RR జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాలు

image

RR జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.✓LRS అప్లికేషన్లో ప్రాసెసింగ్‌పై చర్యలు చేపట్టాలి.✓పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ✓అంగన్వాడి కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలి. ✓జిల్లావ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం విజయవంతం చేయాలి.✓రైతు రుణమాఫీపై రైతులకు సమాచారం అందించండి.

News August 4, 2024

HYD: 309 మంది మందు బాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడిపి 309 మంది బాబులు పోలీసులకు పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 309 మందిలో అత్యధికంగా 211 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కారు, ఒకరు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు.