Hyderabad

News July 1, 2024

హైదరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా HYD కమిషనరేట్ పరిధిలో హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 36, బంజారాహిల్స్ రోడ్డు నంబర్లు 1,2, మహారాజ అగ్రసేన్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి. 

News July 1, 2024

HYD: చౌరస్తాల్లో FULL ట్రాఫిక్.. GHMC కీలక నిర్ణయం

image

HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు చౌరస్తాల్లో నిత్యం ఫుల్ ట్రాఫిక్ ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన కూడళ్లను విస్తరించాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే 3 కమిషనరేట్ల పోలీసులు GHMCకి చౌరస్తాల జాబితాను అందించారు. రాచకొండలో 44, HYDలో 48, సైబరాబాద్‌లో 35 చౌరస్తాలు ఉన్నాయి. మొత్తం 127 కూడళ్లను విస్తరించనున్నారు.

News July 1, 2024

HYD: కూచిపూడి నాట్యంలో వైష్ణవి రంగప్రవేశం

image

HYD రవీంద్రభారతిలో ఆదివారం మైత్రి నాట్యాలయ స్కూల్‌ ఆఫ్ భరతనాట్యం అండ్‌ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు శిరిణికాంత్‌ శిష్యురాలైన వైష్ణవి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా జావళి, తిల్లాన, శ్రీఘననాథం, ఓంకార, తరంగం తదితర అంశాల్లో నర్తించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరై వైష్ణవిని సత్కరించి అభినందించారు.

News July 1, 2024

HYD: కార్ సీఎన్జీ కిట్‌లో గంజాయి అమర్చి అడ్డంగా బుక్కయ్యాడు

image

ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్‌లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌తో పాటు.. పలు పీఎస్‌లలో సురేష్‌పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.

News June 30, 2024

HYD: కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి కిడ్నాప్.. అత్యాచారం!

image

HYD నగరంలో బాలికపై జరిగిన అత్యాచారం కలకలం రేపుతోంది. ఓ బాలికకు కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి, కిడ్నాప్ చేసిన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నరేష్, విజయ్‌తో పాటు.. దాదాపు 8 మందిని అరెస్టు చేశారు.

News June 30, 2024

HYD: వెంకయ్య నాయుడు జీవన యాత్రపై పుస్తకావిష్కరణ

image

HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News June 30, 2024

HYD: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య 

image

మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్‌ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News June 30, 2024

HYD: చేజింగ్‌ చేసిన ఎస్‌టిఎఫ్‌.. డ్రగ్స్ స్వాధీనం

image

ఉత్తరఖాండ్‌ నుంచి సిటీకి తీసుకు వస్తున్న లక్షన్నర విలువ గల హషిష్ అనే డ్రగ్స్‌ను సినిమా పక్కిలో చేజింగ్ చేసి ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ టీమ్‌ పట్టుకున్నారు. కీసర రాంపల్లికి చెందిన రిత్విక్‌.. ఉత్తరాఖాండ్‌ ‌కు వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి వస్తూ 80 గ్రాముల హషిష్‌ అనే డ్రగ్స్ ‌ని తీసుకు వచ్చాడు. అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

News June 30, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు అధికారులపై కేసు

image

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదయింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపాణిపై సీబీఐ కేసు నమోదుచేసింది. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా, విదేశీ కరెన్సీ అక్రమ రావాణాకు సహకరించారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

News June 30, 2024

HYD: రూ.10 కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి..!

image

HYD నగరంలో రూ.10 కోసం జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అన్వర్ (37) ఆటోలో.. ఓ బాలుడు (16) ప్రయాణించాడు. ఆటోడ్రైవర్ ఛార్జీ రూ.20 అడగగా, బాలుడు రూ.10 మాత్రమే ఇచ్చాడు. మిగతా పైసలు ఇవ్వడానికి నిరాకరించిన బాలుడు డ్రైవర్‌ను నెట్టేశాడు. కిందపడిన డ్రైవర్ తలకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.