Hyderabad

News April 19, 2025

OU: 24 నుంచి బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News April 19, 2025

జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

image

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.

News April 19, 2025

OU: ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News April 19, 2025

HYD: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News April 19, 2025

హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

image

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు. 

News April 19, 2025

బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

image

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.

News April 19, 2025

HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

image

SEC రాంగోపాల్ పేట్‌ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2025

HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

image

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.

News April 19, 2025

కంచన్‌బాగ్‌లో అత్యధికం.. ముషీరాబాద్‌లో అత్యల్పం

image

నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఒక చోట ఎక్కువ వర్షం ఉంటే.. మరో చోట తక్కువ వర్షపాతం నమోదైంది. కంచన్‌బాగ్‌లో అత్యధిక వర్షపాతం 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్‌లో 2.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.88 సెం.మీ యాకుత్‌‌పురలో 7.63, బేగంబజార్లో 6.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.