Hyderabad

News May 3, 2024

HYD: ప్రధాని మోదీవి అన్ని అబద్ధాలే: కేటీఆర్ 

image

అబద్ధాలు చెప్పే ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ప్రతి ఒక్కరి జన్​ ధన్​ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రజలను వంచించారని BRS వర్కింగ్​ ప్రెసిడెంట్​ KTR విమర్శించారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్​ MP అభ్యర్థి పద్మారావుగౌడ్​‌కు మద్దతుగా బన్సీలాల్​‌పేట్ జబ్బర్​ కాంప్లెక్స్​ వద్ద నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే తలసాని, పద్మారావుతో కలిసి పాల్గొన్నారు.

News May 3, 2024

BREAKING: HYD: MLA మల్లారెడ్డి ర్యాలీలో అపశ్రుతి

image

HYD బోడుప్పల్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ MLA చామకూర మల్లారెడ్డి పాల్గొన్న బైక్ ర్యాలీలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడుప్పల్‌కి చెందిన BRS యువ నేత శ్రవణ్(24) మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డీజే ఉన్న డీసీఎం చక్రాల కింద ప్రమాదవశాత్తు అతడు పడి మృతిచెందాడు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

image

HYD శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

News May 3, 2024

HYD: టాప్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలి: సీఎస్

image

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన సంస్కరణలపై సీఎస్‌ సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోగా ఈఓడీబీ కింద చేపట్టాల్సిన అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆదేశించారు.

News May 3, 2024

సికింద్రాబాద్‌లో మరోసారి బీజేపీ జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకసారి బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 5వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు బీజేపీ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లాలని ఆయన సూచించారు.

News May 3, 2024

HYD: సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పని చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించారు.

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 3, 2024

HYD: ప్రయాణికులకు TSRTC శుభవార్త

image

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు HYD అధికారులు తెలిపారు. ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఇందులో మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 3, 2024

HYD: ఇంటి వద్ద ఓటు వేసిన వయోవృద్ధులు

image

మే 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం HYDలోని మలక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు వయోవృద్ధుల ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. వారితో ఓటు వేయించారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

HYD: మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు..!

image

HYD మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఎండీ NVS రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, రెండో దశ రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు.