India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

GHMCని నగరవాసులు ‘బల్దియా’గా పిలుస్తారు. ఎందుకు ఈ పదం వాడతారో చాలా మందికి తెలియదు. పూర్వం HYDను ‘అత్రాఫ్‌బల్దా’గా పిలిచేవారు. అరబ్బీలో అత్రాఫ్ అంటే ఆవరణ, బల్దా అంటే పట్టణం. అదే అర్థంతో ఉర్దూలో నగర పాలక సంస్థను ‘బల్దియా’గా పిలవడం ప్రారంభమైంది. HYD నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఆసఫ్‌జాహీల పాలనలో ఉర్దూ అధికార భాష కావడంతో ‘బల్దియా’ ప్రజల నోట నాటుకుపోయింది.

HAPPY NEW YEAR అని వాట్సాప్‌లో ఫొటో వచ్చిందా? జాగ్రత్త. ఈ ఫొటోలో బైనరీ కోడ్ ఉండొచ్చు. దాన్ని డౌన్‌లోడ్ చేస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి పర్సనల్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. దీన్నే డిజిటల్ స్టినోగ్రఫీ స్కామ్ అంటారని నగర పోలీసులు చెబుతున్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు అన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. కొత్త నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తే అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.

అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకునే రోజులకు Gen Z చెక్ పెడుతోంది. స్క్రోలింగ్ మానేసి కిక్కు ఇచ్చే Y2K గ్లో-అప్స్, మీమ్ థెరపీ, ఫ్రెండ్స్‌తో గేమింగ్ నైట్స్‌కి యూత్ ఫిక్స్ అయిపోతుంది. మెంటల్ హెల్త్ పాడుచేసే టాక్సిక్ ట్రెండ్స్‌ను ఘోస్ట్ చేస్తూ సస్టైనబుల్ స్నాక్స్, సెల్ఫ్ కేర్ హ్యాక్స్‌తో తమ ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ చాటుకుంటున్నారు. ఇలానే 2026 కొత్త ఏడాదిని మన స్టైల్లో ఎంజాయ్ చేద్దాం.
Happy New Year
Sorry, no posts matched your criteria.