Hyderabad

News April 11, 2025

HYDలో రూట్ మ్యాప్ విడుదల

image

రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్‌ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

News April 11, 2025

HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

image

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.

News April 11, 2025

26/11 అటాక్‌లో హైదరాబాద్ ప్రస్తావన

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.

News April 11, 2025

HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

image

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్‌ మర్డర్ వెనుక విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్‌ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.

News April 10, 2025

HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

image

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్‌నగర్‌‌లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka

News April 10, 2025

HYD: సామూహిక సీమంతాల్లో పాల్గొన్న కలెక్టర్

image

హిమాయత్‌నగర్ సెక్టార్‌ బీమా మైదాన్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ‘గర్భిణులకు సరైన పోషకాహారం అత్యవసరం. అంగన్వా డీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. శిశు ఆరోగ్యం దేశ భవిష్యత్తు ఆధారం’ అని కలెక్టర్ పేర్కొన్నారు. DWO అక్కేశ్వరరావు, CDPO కృష్ణ చైతన్య, సూపర్‌వైజర్ బాలా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

News April 10, 2025

FLASH..శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

image

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.

News April 10, 2025

HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

image

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.

News April 10, 2025

కోఠిలో ఉచితంగా రూ.12 లక్షల ఆపరేషన్..!

image

పలు కారణాలతో చిన్నపిల్లలకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటున్నట్లు కోఠి ENT ఆసుపత్రి డాక్టర్ వీణ తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా పిల్లలు వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని, రూ.12 లక్షలు ఖర్చు చేసే దీనిని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా కోఠి ఆసుపత్రిలో 60 నుంచి 70 సర్జరీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.# SHARE IT

News April 10, 2025

HYD: అమ్మాయిల వైపు చూస్తే అంతే!

image

HYDలోని ఉప్పల్, రామంతపూర్, నాచారం, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బస్టాపులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీం ప్రతి చర్యను గమనిస్తోంది. గుంపులో ఎవరూ చూడడం లేదని అమ్మాయిలతో వెకిలి చేష్టలు, చెడుగా ప్రవర్తిస్తే అంతు చూస్తామని షీ టీం హెచ్చరించింది. పరాయి వ్యక్తుల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే నిర్భయంగా యువతులు, మహిళలు 100, 8712662111 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.