India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD మెట్రోలో రద్దీ పెరిగిపోతోంది. 8 AM నుంచి 10 AM మధ్య ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో నిల్చునేందుకు కూడా వీలుండట్లేదని ప్రయాణికుడు ఒకరు తెలిపారు. ఇరుకు ప్రయాణంతో అస్వస్థతకు గురవుతున్నామన్నారు. బుధవారం ఓ యువతి స్పృహ తప్పి పడిపోవడంతో యూసుఫ్‌గూడ స్టేషన్‌లో ప్రథమ చికిత్స నిమిత్తం సిబ్బందికి అప్పజెప్పినట్లు ఆ ప్రయాణికుడు Way2Newsకు తెలిపారు. సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
సికింద్రాబాద్ బోయిగూడ Y జంక్షన్ వద్ద ఉన్న MNK విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్‌మెంట్ వాసులు పార్కింగ్ ఏరియా పరిధిలో ఏకంగా 18 ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గతంలో నీటి కొరతతో ఇబ్బందులు ఉండేవని, వాటర్ ట్యాంకర్లకే రూ.7 లక్షలు ఖర్చు అయ్యేవన్నారు. ఈ ఏడాది ఇంకుడు గుంతల పుణ్యమా అని ఆ ఇబ్బంది కలగలేదన్నారు. ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా కొనుగోలు చేయలేదని కమిటీ ప్రెసిడెంట్ హనుమాన్లు తెలిపారు.
HYDలో వ్యభిచార గృహాలపై పోలీసులు రైడ్స్ చేశారు. గుడిమల్కాపూర్‌లో స్పా & మసాజ్ సెంటర్ ముసుగులో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. స్పా సెంటర్ ఓనర్‌పై కేసు నమోదైంది. ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. 8 మంది అమ్మాయిలను రెస్క్యూ చేసినట్లు CI తెలిపారు. నాగోల్ PS పరిధిలోనూ మంగళవారం రైడ్స్ చేసిన పోలీసులు నిర్వాహకురాలితో పాటు మరో విటుడిని అదుపులోకి తీసుకొన్నామన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 42 రోజుల్లో 83 రెస్టారెంట్లు, తదితర హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి మే 27 వరకు రైడ్స్ జరిగాయన్నారు. గ్రేటర్‌లో నిల్వచేసిన మాంసం, ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించిన 58 రెస్టారెంట్‌లు, అపరిశుభ్రతతో పాటు లైసెన్స్ లేని మరో 10 హోటళ్లకు నోటీసులు అందించామన్నారు. ఇక జూన్ 1 నుంచి నిబంధనలు పాటించని హోటళ్లకు FINE విధించనున్నారు.
SHARE IT
HYDలో డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. కడప జిల్లా వాసి(39)కి ఏడాది క్రితం మూత్రపిండాలు ఫెయిల్ కావడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. నాటి నుంచి తదితర మెడిసిన్స్ వాడారు. ఇటీవల వృషణాల్లో వాపు రావడంతో బంజారాహిల్స్‌లోని AINUలో అడ్మిట్ అయ్యారు. టెస్టులు చేసిన డాక్టర్లు డంబెల్ ఆకారంలోని కణితి పెరిగినట్లు గుర్తించారు. సోమవారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి పేషెంట్‌ను కాపాడారు.
హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలు రోజుల తరబడి నిల్వ చేయొద్దని సూచిస్తున్నారు. ఇటీవల ప్రముఖ హోటల్స్‌లోనూ సోదాలు చేసి పాడైపోయిన ఆహారపదార్థాలను గుర్తించారు. ఇటీవల రాంనగర్‌లో మండి తిన్న ఇద్దరు, షాద్‌నగర్‌లో ఒకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇటువంటి హోటళ్లను సీజ్ చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
HYD జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీ 22వ బ్లాక్, ప్లాట్ నంబర్-4 బాదం చెట్టు పక్కన ఉన్న ఇల్లులో అద్దెకు ఉంటున్న రాధిక(34) అంతుచిక్కని వ్యాధితో నడవలేక నరకయాతన అనుభవిస్తుందని Way2News నిన్న ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందిస్తున్న సామాజిక ప్రజలు వారికి తోచిన సాయం అందజేస్తున్నారు. ఆర్థిక సహాయం చేసిన సుంకరి రాజు మాట్లాడుతూ.. కఠిన పరిస్థితుల్లో ఉన్నారని, సహాయం చేయడానికి అందరూ కదలిరావాలన్నారు.
HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు ఈరోజు <<13329773>>పిల్లలను ఎత్తుకెళుతున్న ముఠాను<<>> అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మేడిపల్లి పరిధిలో ఓ చిన్నారిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. 16మందిని పోలీసులు కాపాడారు. కాగా పీర్జాదిగూడలో రూ.4.5లక్షలకు చిన్నారిని RMP శోభారాణి విక్రయించినట్లు పోలీసులు, CWC అధికారులు తెలిపారు. ఆమెతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర జాగ్రత్త. SHARE IT
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తిమీర ఉత్పత్తి తగ్గడం, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో హైదరాబాద్‌లో కొత్తిమీరకు డిమాండ్ చాలా పెరిగింది. హోల్ సేల్ మార్కెట్లలో కట్ట విలువ రూ.30, బహిరంగ మార్కెట్‌లో రూ.35 నుంచి రూ.40 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 15 రోజుల వరకు ఇలాగే కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు స్థానిక బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇక మల్కాజిగిరి ఎంపీ స్థానానికి సంబంధించి కీసరలోని హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాల, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, విల్లా మేరి కళాశాలలో లెక్కింపు కొనసాగనుంది. HYD, సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు గత అసెంబ్లీ ఎన్నికల కేంద్రాల్లోనే కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.