Hyderabad

News May 1, 2024

HYD: మఫ్టీలో పోకిరీలపై షీ టీం నిఘా!

image

HYD మెట్రో, MMTS రైళ్లు, ప్రదర్శనలు, వినోద కార్యక్రమాల్లో మఫ్టీలోని షీ టీమ్స్ నిఘా కళ్లు పోకిరీలను వెంటాడుతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో 14 బృందాలు మఫ్టీలో నిత్యం పహారాకాస్తున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో మఫ్టీలో ఉంటున్న ఈ బృందాలు దూరంగా ఉండి ఆకతాయిల చేష్టలను వీడియో రికార్డ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆకతాయిలకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

News May 1, 2024

HYD: రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

image

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన లింగారెడ్డిగూడ సమీపంలో చోటుచేసుకుంది. లింగారెడ్డిగూడా సమీపంలోని మజీద్ వెనకాల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

HYD: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడిపై కేసు

image

మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News May 1, 2024

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి శిక్ష

image

ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన ఛత్రినాక PS పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఎలక్ట్రీషియన్. 2021లో అతడు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.

News May 1, 2024

HYD: చిరుత తిరుగుతున్న ప్రాంతాలు ఇవే!

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్.
SHARE IT

News May 1, 2024

HYD: లవర్‌తో OYOకి వెళ్లిన యువకుడి మృతి

image

OYOకి వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108‌కి కాల్‌ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది.

News May 1, 2024

RR: ప్రాజెక్టుల పై ప్రజల కోటి ఆశలు!

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి రూ.2,050 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.9000.59 కోట్లను మొదట ఖర్చు చేసి, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి RR జిల్లా ప్రజలు ప్రాజెక్టుల పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

News April 30, 2024

HYD: ఫ్లై ఓవర్ పై నుంచి పడి కార్మికుడు మృతి

image

ఫ్లై ఓవర్ పైనుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ప్రబీర్ సర్దార్(22) చే నెంబర్ ఫ్లై ఓవర్ పై సెంట్రింగ్ పని చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News April 30, 2024

ఓయూ సెలవులు రద్దు: రిజిస్ట్రార్ 

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశంతో ప్రతియేటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలోనే ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 30, 2024

HYD: ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్!

image

HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.