India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్ ఎస్ఈ ఎన్.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి ఈరోజు మృతిచెందారు. గతంలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా పనిచేసిన రంగారెడ్డి.. ఇటీవల నీటి పారుదల శాఖకు కన్సల్టెంట్‌గా నియామకమయ్యారు. కాలు విరిగి HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టును సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ ఫారం పైన అనుమానాస్పదంగా ఉన్న చందు వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం HYD నాంపల్లి గాంధీభవన్‌లో ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. గొప్ప నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
SHARE IT
హైదరాబాదీలను అకాల వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేటలో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి.
SHARE IT
2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
Sorry, no posts matched your criteria.