Hyderabad

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

HYD: స్నాప్‌ చాట్‌లో నకిలీ ID.. రూ.14 లక్షల వసూలు

image

ఓ యువకుడు అమ్మాయి పేరిట డబ్బులు కాజేశాడు. సైబర్‌ క్రైం ACP బి.రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్‌రెడ్డి(23) స్నాప్‌ చాట్‌లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ ID సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్‌ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

News May 25, 2024

HYD: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

జూన్ 3వ తేదీ నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారిణి కె.రోహిణి పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 35 కేంద్రాల్లో 12,186 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఆయా సెంటర్‌లకు సకాలంలో చేరుకోవాలని ఆమె సూచించారు. SHARE IT

News May 25, 2024

HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

image

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌- సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్- మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు. SHARE IT

News May 24, 2024

భాగ్యలక్ష్మి ఆలయంలో మధ్యప్రదేశ్ CM

image

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.

News May 24, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> బిగ్ బాస్కెట్ గోడౌన్‌లో డేట్ అయిపోయిన వస్తువులు
> మద్యంమత్తులో హల్‌చల్ చేసిన యువతీ యువకుడు అరెస్ట్
> గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యం
> శామీర్‌పేటలో దొంగల బీభత్సం
> మలక్‌పేట్‌లో ఇద్దరు పిల్లలతో గృహిణి MISSING
> భార్యను చంపేసి పరారీ.. చివరికి అరెస్ట్
> గండిపేటలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
> ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

News May 24, 2024

HYD: భార్య‌ను చంపేసి‌ పరారీ.. అరెస్ట్

image

హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధి సాయి అనురాగ్‌ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు. 

News May 24, 2024

HYD: మమ్మల్ని కొనసాగించండి: ఔట్ సోర్సింగ్ సిబ్బంది

image

తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.

News May 24, 2024

HYD: నూతన చట్టాలు భద్రతకు మైలురాయి: రాచకొండ సీపీ

image

త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.

News May 24, 2024

HYD: గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు: వైద్యాధికారి

image

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సలహా కమిటీ సభ్యులకు సూచించారు.