India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్ పరిధిలోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింట్ డిటెక్టివ్ సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్ 5 వరకు ఈ అవకాశం ఉందని, ఆసక్తి గల అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైఫ్ సైన్సెస్ పై ఆసక్తి గల వారికి నెట్వర్కింగ్, ల్యాబ్ అంశాల పై ట్రైనింగ్ అందిస్తారు.
SSC పూర్తి పాసైన వారికి సెంట్రల్ అధికారులు శుభవార్త తెలిపారు. HYD నగరం చర్లపల్లిలోని CIPET కేంద్ర విద్యాసంస్థలో పలు ప్లాస్టిక్ టెక్నాలజీ డిప్లమా కోర్సులు చేసేందుకు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.మే 31 వరకు https://cipet24.onlineregistrationform.org/CIPET/LoginAction_registerCandidate.action లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ సైతం వస్తుంది.
తుర్కయంజాల TISS విద్యా సంస్థలు పీజీ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. M.A స్కూలు ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్, స్కూల్ ఆఫ్ జెండర్ అండ్ లైవ్ హడ్స్ , స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విద్య కుమార్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ బోయినపల్లిలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి వాహనం బోల్తా పడి దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయినట్లు సమాచారం. రోడ్డుపై మద్యం సీసాలు పడడంతో వాహనదారులు వాటిని పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఉమా మహేశ్వర్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ కొనసాగనుంది. మరికాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు.
నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోపై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.
గ్రేటర్ HYD నగరంలో మోడల్ కారిడార్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన రహదారులే లక్ష్యంగా GHMC ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎల్బీనగర్, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కాలిబాట, సైకిల్ ట్రాక్, వీధి వ్యాపారులకు స్థలం, సర్వీసు రోడ్డు, మూడు లైన్ల ప్రధాన రహదారి, పచ్చదనంతో కూడిన విభాగిని ఉండేలా రూ.56.82 కోట్లతో 29 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు జరగలేదు.
Sorry, no posts matched your criteria.