Hyderabad

News April 10, 2025

చిక్కడపల్లి: విజయయాత్ర మార్గాన్ని పరిశీలించిన సీపీ

image

హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించే ‘వీర హనుమాన్‌ విజయ యాత్ర’ రూట్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామమందిరం నుంచి నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు చౌరస్తా, అశోక్‌నగర్, కవాడిగూడ, బైబిల్‌ హౌస్‌, తాడ్‌‌బండ్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు దాదాపు 12.2 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌మాన్, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జోయల్‌ డేవిస్ ఉన్నారు.

News April 10, 2025

HYD: చికెన్, మటన్ షాపులు బంద్

image

గ్రేటర్‌ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT

News April 10, 2025

HYD: నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

image

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.

News April 9, 2025

HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

image

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

News April 9, 2025

HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

image

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

News April 9, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ బ్లాస్ట్‌కు వేరే దగ్గర ప్లాన్

image

దిల్‌సుఖ్‌నగర్ <<16034773>>బాంబ్ బ్లాస్ట్<<>> ఘటనలో నిందితులకు నిన్న హై కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో వఖాస్ బాంబుతో సైకిల్‌ని 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్‌ను కూడా హుస్సేన్‌సాగర్‌లో పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.

News April 9, 2025

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం

image

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్‌లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.

News April 9, 2025

HYD: రాజాసింగ్‌పై 3 సెక్షన్ల కింద కేసులు

image

గోషామహల్ MLA రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.

News April 9, 2025

హుస్సేన్ సాగర్లో యువతిని కాపాడిన హైడ్రా బృందం

image

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.