Hyderabad

News May 22, 2024

TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు మన HYDలో..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ఇంటర్మీడియట్ పూర్తై ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈమేరకు మన HYDలో TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నట్లు NIR వెల్లడించింది. దేశంలోనే IITH-18, IIIT HYD-55, HCU-71, JNTUH-83 ర్యాంకు సాధించాయి. టాప్ కాలేజీలలో అత్యుత్తమ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు NIRF పేర్కొంది.

News May 21, 2024

HYD: పోలీసులపై గొడ్డలితో దాడి.. ముగ్గురు అరెస్టు

image

మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో రెండు బైకులు ఢీకొనడంతో వాళ్ల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తుండగా ఆ వ్యక్తులు పోలీసులపై కత్తితో దాడి చేశారు.

News May 21, 2024

KPHB పీఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

image

మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మాధురి(32) అనే వివాహితకు 14 ఏళ్ల క్రితం శివార్పన్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఏడాది క్రితం నుంచి రోడ్డు నెం.3లోని EWSలో ఉంటూ బ్యూటిషన్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే విశ్వనాథరెడ్డి చెప్పకుండా హాస్టల్ ఖాలీచేసి వెళ్లడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

News May 21, 2024

భూగర్భ జలాలు పెంచేందుకు GHMC కొత్త ప్రాజెక్ట్

image

అమృత్ పథకంలో భాగంగా, పైలట్ ప్రాతిపదికన ‘షాలో అక్విఫర్ రీఛార్జ్’ పేరిట ప్రాజెక్ట్‌ను GHMC చేపట్టింది. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి NIUA నోడల్ ఏజెన్సీ నగరంలో ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. 100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేయడం ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వర్షపు నీటిని ఆదా చేయగలిగితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.

News May 21, 2024

HYD: పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి టిజెస్ మద్దతు

image

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్ స్పష్టం చేసింది. ఈనెల 27న జరగనున్న వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జు తెలిపారు.

News May 21, 2024

HYD: మొబైల్ రికవరీలో తెలంగాణ రెండోవ స్థానం

image

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు.

News May 21, 2024

HYD: ‘నా భార్యను నేనే చంపాను’ 

image

HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో <<13285941>>భార్య కమలను భర్త రమేశ్ హత్య<<>> చేసిన విషయం తెలిసిందే.  పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కెటింగ్ జాబ్ చేసే రమేశ్‌కు కమలతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్‌ అర్ధరాత్రి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరిగి ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 

News May 21, 2024

HYD: సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై వర్క్‌షాప్‌

image

పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. 

News May 21, 2024

HYD: తెలంగాణను నంబర్-1గా మారుస్తాం: మంత్రి

image

HYD హైటెక్స్ వద్ద జరిగిన ఓ సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. RRR-రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో IGBC సంస్థ RRR (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానం అమలు చేసేందుకు పని చేస్తున్నారన్నారు. మన అందరి లక్ష్యం RRR కావడం యాదృచ్ఛికం అని అన్నారు. రాష్ట్రంలో RRR నిర్మాణం, మూసీ ప్రక్షాళన, మౌలిక సదుపాయల కల్పనతో దేశంలో తెలంగాణను నంబర్-1గా మార్చుతామన్నారు.

News May 21, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సోలార్ విద్యుత్

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ఫ్లాట్ ఫాం, స్టేషన్ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్, లెవెల్ క్రాసింగ్ పాయింట్ రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయనున్నారు. ఈ నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. 1.782 మెగావాట్ల సోలార్ ప్యానల్స్ ప్రాజెక్టు కోసం అధికారులు టెండర్ జారీ చేశారు.