India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ బొల్లారంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే దంపతులు రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది. ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి టీచర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
JNTUలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనం ప్రారంభానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మంగళవారంతో ప్రస్తుత VC కట్టా నరసింహారెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆలోగా ఈభవనాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో గత వారం క్రితమే ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికీ కొన్ని పనులు భవనం లోపల కొనసాగుతుండటంతో ప్రారంభానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం నేటితో ముగియనుంది. మూడేళ్ల క్రితం వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన క్యాంపస్‌లోని వైస్ ఛాన్సలర్ నివాసంలో ఉంటూ 21 పాయింట్ ఫార్ములాతో నిత్యం వర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. PHD విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఇచ్చి వందలాదిమంది పూర్వ విద్యార్థులకు డాక్టర్ డిగ్రీలను అందుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఓయూకి కొత్త వీసీ రానున్నట్లు సమాచారం.
రైలు నుంచి దూకేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. HYD కాచిగూడ రైల్వే ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు.. కాచిగూడకి చెందిన రమేశ్ లింగంపల్లిలోని తన అన్న సాయి ఇంటికి వెళ్లడానికి కుమార్తెలు పూజ(15), విజయ(13), కుమారుడితోపాటు తన అన్న మనవరాళ్లతో కలిసి కాచిగూడ స్టేషన్‌కు వచ్చారు. తొలుత పిల్లలందరినీ ఎక్కించిన రమేశ్ కదులుతున్న రైలును ఎక్కబోతూ కిందపడ్డాడు. అనంతరం కుమార్తెలు కూడా దూకేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోలను వైరల్ చేసిన అభియోగంపై అరెస్టయిన బీజేపీ మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ వి.శ్రవణ్ కుమార్‌కు నాంపల్లిలోని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత గురువారం ఆయన స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉండగా మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకువెళ్లిన విషయం విదితమే. అదే కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 3, 5, 8వ తరగతుల ప్రవేశాలకు హైదరాబాద్‌కు చెందిన గిరిజన బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటజీ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 41 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫారంను HYD కలెక్టరేట్ గిరిజన కార్యాలయంలో సమర్పించాలన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. అధికారులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో కొద్ది గంటల పాటు కరెంట్ లేదని ఓ వీడియోను సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీనిపై ఆరా తీసిన అధికారులు అది కొన్నేళ్ల కిందట తీసిన వీడియోగా గుర్తించారు. ఆసుపత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో ఈరోజు దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జనగామకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ ఆమెను అర్ధరాత్రి చంపి PSలో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభమైంది. నగరంలోని పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో రావడంతో సందడి కనిపించింది. తాగునీరు ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంతో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్‌లో మొత్తం 387 మందికి 260 మంది పరీక్ష రాశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
నగరంలో చేపట్టే వివిధ ఇంజినీరింగ్ పనుల కోసం గతేడాది మే నెలకు సంబంధించిన రూ.57.23 కోట్ల బిల్లులను జీహెచ్ఎంసీ సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.1,300 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉందని గుత్తేదారులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గుత్తేదారులతో చర్చించి మరికొంత సమయం కోరారు. తాత్కాలిక ఉపశమనంగా కొంత మొత్తాన్ని విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.