Hyderabad

News April 24, 2024

కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

image

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

News April 24, 2024

HYD: నగరానికి త్వరలో ఫైర్ ఫైటింగ్ రోబోలు

image

HYD నగరంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. త్వరలో అగ్నిమాపక శాఖకు 18 చిన్న శకటాలు తెస్తామని తెలిపారు. మరోవైపు ఐదు ఫైర్ ఫైటింగ్ రోబోలు రానున్నాయని, వరద బాధితులను రక్షించేందుకు మానవ రహిత రిమోట్ లైఫ్ బాయ్స్ అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. HYD నగరం సహా రాష్ట్రవ్యాప్తంగా నూతన సంస్కరణలకు శ్రీకారం చూడతామన్నారు.

News April 24, 2024

HYD: NIMS ఆసుపత్రిలో రోబో చికిత్సల LIST ఇదే!

image

✓సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ: గాల్ బ్లాడర్, క్లోమగ్రంథి, కాలేయం, పేగులు, అన్నవాహిక అవయవాల్లో క్యాన్సర్ ఇతర కణుతులు ✓యురాలజీ మూత్రకోశం, ప్రొస్టేట్, కిడ్నీ, కిడ్నీ నుంచి వెళ్లే ట్యూబ్ బ్లాకేజ్‌లు, పెల్విస్, ఆడ్రీనల్ గ్రంథుల్లో క్యాన్సర్ కణుతులు ✓సర్జికల్ అంకాలజీ: గర్భసంచి, అండాశయం, పేగులు ఇతర క్యాన్సర్లు •పై వాటికి NIMSలో రోబో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

News April 24, 2024

HYD: NIMSలో రోబో సహాయంతో ట్రీట్మెంట్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో రోబో సహాయంతో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోబో చికిత్సల కోసం రూ.2-6 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం తక్కువకే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News April 24, 2024

హైదరాబాద్‌లో రూట్‌ MAP ఇదే!

image

రేపు HYDలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే‌ రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై తాడ్‌బండ్ టెంపుల్‌ వరకు కొనసాగుతుంది. పుత్లీబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, RTC X రోడ్స్‌, అశోక్‌నగర్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట, బైబిల్‌హౌస్, ఉజ్జయిని టెంపుల్, ప్యారడైజ్‌ మీదుగా తాడ్‌బండ్‌కు చేరుకుంటుంది. రేపు 11.30AM నుంచి 8PM వరకు ఈ రూట్‌లో ఆంక్షలు ఉంటాయి.

News April 24, 2024

HYD: ప్రతి ఏటా పెరుగుతున్న గంజాయి!

image

శామీర్పేట, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, జవహర్ నగర్ ప్రాంతాలలో గంజాయి కేసుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో కలిపి 2022లో 581 కిలోల గంజాయి పట్టుపడగా.. 2023లో 1,236 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలను తగ్గించడం పై పోలీసులు ఈ ఏడాది స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.

News April 24, 2024

HYD: రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్ల పెంపు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో అధికారులు మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికులు టికెట్ తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా బుకింగ్ కార్యాలయంలో స్పెషల్ బుకింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అడిషనల్ బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, బుకింగ్ ఆఫీసు సైతం ప్రయాణికులతో నిండిపోతుంది.

News April 24, 2024

HYD: నేటితో ముగియనున్న గడువు

image

ఇంటివద్ద ఓటేయాలనుకుంటున్న వృద్ధులు, దివ్యాంగులు 12-డీ పత్రాలు సమర్పించేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే ఇటువంటి వారిని గుర్తించిన అధికారులు ఇంటింటికి పత్రాలు పంపిణీ చేశారు. వారు సుముఖత తెలిపేందుకు సోమవారంతో గడువు ముగుస్తుంది. పోలింగ్ కేంద్రం వద్దకు రాలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఇంటివద్ద ఓటేసే వారు మూసాపేట సర్కిల్ కార్యాలయంలో పత్రాలు సమర్పించాలన్నారు.

News April 24, 2024

మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా HYDకి చెందిన సాఫ్ట్ వేర్

image

హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రుతీ చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతీ చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

News April 24, 2024

HYD: నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. RR జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆరే మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్ ప్రపోజల్ సంతకం చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.