Hyderabad

News April 21, 2024

HYD: తొమ్మిదేళ్లలో రూ.1,110 కోట్లు

image

HMDA, GHMC పరిధిలో తొమ్మిదేళ్లలో హరితహార కార్యక్రమం కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయా శాఖలు వెల్లడించాయి. రెండిటి పరిధిలో దాదాపు రూ.1,110 కోట్లు ఖర్చు పెట్టాయి. HMDA రూ.974.85 కోట్లు,GHMC రూ.136.13 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొంది. వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించింది.

News April 21, 2024

HYD: మద్యం తాగడంతో వాంతులు.. యువకుడి మృతి

image

మద్యం తాగిన యువకుడు వాంతులు చేసుకొని మృతి చెందిన ఘటన HYD గచ్చిబౌలి పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన సీమంత దత్తా 2 నెలల క్రితం గచ్చిబౌలికి వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కేశవ్ నగర్‌లో ఉన్న సీమంత దత్తాని రూమ్‌మేట్ ప్రభాకర్ వెళ్లి చూడగా మద్యం తాగి వాంతులు చేసుకున్నాడు. రూమ్‌కి వెళ్దామనగా తర్వాత వస్తానన్నాడు. తిరిగి వచ్చి చూడగా మృతి చెందాడు.

News April 21, 2024

HYD: ఆదివారం ఆస్తి పన్ను వసూలు

image

ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, నెలాఖరుతో పథకం ముగుస్తున్నందున ఆదివారం పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని ఆయన వెల్లడించారు.

News April 21, 2024

HYD: గుండెపోటుతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

image

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి (దేవరోనితండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా(EEE) 3వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే  అప్రమత్తమైన తోటి విద్యార్థులు సిద్దును ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు.

News April 21, 2024

HYD: రూ.5 వేలకు ఐపీఎల్ బ్లాక్ టికెట్లు?

image

ఉప్పల్ స్టేడియంలో IPL టికెట్ల అమ్మకాల్లో కుంభకోణం జరిగిందని ఓవైపు పలు సంఘాలు ఆరోపిస్తుంటే సోషల్ మీడియా వేదికగా రెండు ఐపీఎల్ టికెట్లు రూ.5,000 అంటూ విక్రయానికి రెడీ అయ్యారు. SRH VS RCB మ్యాచ్ ఏప్రిల్ 25న జరగనుండగా, సోషల్ మీడియా వేదికగా తమ వద్ద టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాలనుకున్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీని పై అధికారులు స్పందించాల్సి ఉంది.

News April 20, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> చర్లపల్లి ఖైదీ కడుపులో ఇనుప మేకులు
> ధూల్ పేటలో భారీగా నల్లమందు స్వాధీనం
> గోల్నాకలో కిషన్ రెడ్డి జీప్ యాత్ర
> దోమలగూడ‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
> కాచిగూడలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
> శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
> సికింద్రాబాద్ బస్‌స్టేషన్‌లో బాలిక మిస్సింగ్
> హైదరాబాద్‌లో FAKE డాక్టర్ అరెస్ట్
> నగరంలోని పలు ప్రాంతంలో కురిసిన వర్షం

News April 20, 2024

HYD: 9 మేకులు మింగిన ఖైదీ

image

చర్లపల్లి జైలు​ ఖైదీ మహ్మద్​ షేక్​ (32) ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డులో చేరాడు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ HOD ప్రొ.శ్రవణ్​ కుమార్​ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 9 మేకులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

News April 20, 2024

HYD: బట్టతలపై వెంట్రుకలు.. FAKE డాక్టర్ అరెస్ట్

image

HYDలో నకిలీ డాక్టర్‌ గుట్టు రట్టయ్యింది. బట్టతలపై జుట్టు రప్పిస్తానని నమ్మిస్తున్న అస్లాం‌ను సౌత్‌‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చర్మరోగాలు, హెయిర్‌ ట్రాన్స్‌ఫ్లాంట్‌‌కు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్‌పురా, గచ్చిబౌలిలో ఏకంగా క్లినిక్‌లు ఓపెన్ చేయడం గమనార్హం. బాధితులకు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో‌ పోలీసులను ఆశ్రయించారు. శనివారం రైడ్స్ చేసి అస్లాంను అరెస్ట్ చేశారు.

News April 20, 2024

HYD: కంటోన్మెంట్‌లో BRSకు BIG షాక్

image

కంటోన్మెంట్ నియోజకవర్గంలో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత సాయన్న ప్రధాన అనుచరుడు ముప్పిడి మధుకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ BRS ముఖ్య నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడం‌తో అధికార పార్టీ మరింత బలంగా తయారైంది.

News April 20, 2024

HYD: కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవడం మరిచారా? ఇలా చేయండి!

image

RTC బస్సులో ఒక్కోసారి కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత వెనక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి సంఘటన RR జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. రూ.500 నోటును కండక్టర్‌కు ఇవ్వగా రూ.60 టికెట్ ఇచ్చి, మిగితా రూ.440 బస్ దిగేటప్పుడు ఇస్తానని టికెట్ వెనుక రాశాడు. అయితే సదరు ప్రయాణికుడు మర్చిపోయి RTC ఉన్నతాధికారులను సంప్రదించగా.. రూ.440 ఫోన్ పే చేశారు. మీకు ఇలా జరిగితే 040-69440000 సంప్రదించండి.