Hyderabad

News April 20, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

News April 20, 2024

HYD: తెలంగాణ ఖ్యాతిని చాటిన తెలుగు తేజాలు

image

కరీంనగర్ వాసి పీచు నరేశ్ రెడ్డి, హైదరాబాద్ వాసి దండుగుల వెంకటేశ్‌లు నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపులో 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారు. వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను వారు ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని ఈ తెలుగు తేజాలు పేర్కొన్నారు.

News April 19, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల
> విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
> చిలుకూరు బాలాజీ టెంపుల్ కి క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
> KPHBలో రూ.లక్ష నగదు సీజ్ చేసిన పోలీసులు
> రోడ్డు ప్రమాదంలో సరూర్ నగర్ PS కానిస్టేబుల్ మృతి
> HYD సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
> సనత్ నగర్‌లో కాంగ్రెస్ కార్యకర్త మృతి
>బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులఅరెస్ట్

News April 19, 2024

HYD: రాంగ్ రూట్లో ప్రయాణిస్తే కేసు

image

వాహనదారులు మీకో బ్యాడ్ న్యూస్. రాంగ్ రూట్‌లో వెళ్తే ఏం కాదని లైట్ తీసుకుంటే మాత్రం మీ పై ఐపీసీ 336 కింద కేసు నమోదవ్వడం ఖాయమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్ రూట్లో ప్రయాణించిన 23 మంది వాహనదారులు, ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

News April 19, 2024

సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజు రోజుకీ రద్దీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ లిస్ట్ విడుదల చేశారు. ఏప్రిల్ 21 నుంచి జూన్ వరకు పలు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

నవాబుపేట మండలంలో భారీగా పట్టుబడిన నగదు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుకున్నారు. మోమిన్ పేట్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నవాబుపేట ఎస్సై భరత్ భూషణ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.1 కోటి 5 లక్షల నగదు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

News April 19, 2024

HYD: సైబర్ నేరాల పై ఫిర్యాదు చేయటం ఇక ఈజీ!

image

రోజు రోజుకి 1930 సైబర్ హెల్ప్ లైన్ కాల్స్ పెరగటం, లైన్ బిజీ రావటం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేసి, వెంటనే స్పందించేందుకు ప్రతి స్టేషన్ పరిధిలోని సైబర్ యోధులకు(సైబర్ క్రైమ్ కానిస్టేబుల్) ప్రత్యేక సెల్ ఫోన్లు అందిస్తున్నారు. HYD, RR, MDCL, VKB జిల్లాలోనూ ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే వికారాబాద్‌లోని పలు స్టేషన్లలో అందజేశారు. 1930కు కాల్ చేసిన వెంటనే స్పందించి, సైబర్ నేరాలపై చర్యలు తీసుకోనున్నారు.

News April 19, 2024

HYD: జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు: ఈసీ

image

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

News April 19, 2024

HYD: ఈనెల 23న వీర హనుమాన్ విజయ యాత్ర

image

హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. భాగ్యనగర్ కేంద్రంగా వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో ఈనెల 23న హనుమాన్ జన్మోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.

News April 19, 2024

HYD: బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అరెస్ట్

image

బ్లాక్‌లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.