India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో ఈసారి పోలింగ్ పెరిగింది. 2019లో HYDలో 44.84% నమోదవగా 2024లో 46.08% పోలింగ్ జరిగింది. ఇక సికింద్రాబాద్‌లో 2019లో 46.50% కాగా 2024లో 48.11%, మల్కాజిగిరిలో 2019లో 49.63% కాగా 2024లో 50.12%, చేవెళ్లలో 2019లో 53.25% కాగా 2024లో 55.45% పెరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో సుమారు 2% పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరిని గెలిపిస్తుందో వేచి చూడాలి?
ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
రాజధాని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోక్‌సభలో 30 మంది, సికింద్రాబాద్‌లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సా.6 గంటల వరకు HYDలో 46.08, మల్కాజిగిరిలో 50.12, సికింద్రాబాద్ 48.11, చేవెళ్ల 55.45 శాతం పోలింగ్ నమోదైందని ఓటర్ టర్నౌట్ పేర్కొంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 50.34 శాతం పోలింగ్ నమోదైంది. అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది.
SHARE IT
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నేడు జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో BJP కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో BJP సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు.
HYDలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ IPS షికా గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD నగరవ్యాప్తంగా ఉన్న పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి, సమస్యల పై ప్రశ్నిద్దాం..! అంటూ పిలుపునిచ్చారు.HYD మహానగరంలో 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదు.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. సా.5 గంటల వరకు HYDలో 39.17, మల్కాజిగిరిలో 46.27, సికింద్రాబాద్ 42.48, చేవెళ్ల 53.15 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. అందరూ ఓటేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.