Hyderabad

News May 13, 2024

BREAKING: HYD: పోలింగ్ కేంద్రంలో మహిళ మృతి!

image

HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News May 13, 2024

HYD: ఓటేసిన రాచకొండ సీపీ

image

సికింద్రాబాద్ పరిధి గోపాలపురంలో ఉన్న St.ప్యాట్రిక్ స్కూల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

News May 13, 2024

HYD: మ.1 గంట వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.1 గంట వరకు HYDలో 19.37, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ 24.91, చేవెళ్ల 34.56 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 29.03 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

HYD: ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోంది: వికాస్‌రాజ్‌

image

వర్షాలు, విద్యుత్‌ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. HYDలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News May 13, 2024

చేవెళ్లలో ఓటేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News May 13, 2024

HYD: ఈవీఎంల మొరాయింపు.. తిరిగి వెళ్లిపోతున్నారు..!

image

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్‌నగర్, షాద్‌నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News May 13, 2024

HYD: ఉ.11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

HYD: ఓటేసిన బండ్ల గణేశ్

image

టాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వచ్చారు. ఆయన సతీమణి కూతురు, కుమారుడితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నంబర్ 248లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 13, 2024

HYD: ఉ.9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.9 గంటల వరకు HYDలో 5.06, మల్కాజిగిరిలో 6.20, సికింద్రాబాద్ 5.40, చేవెళ్ల 8.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 6.28 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

HYDలో విషాదం.. ఎలక్షన్‌ ఆఫీసర్ మృతి

image

గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. చంపాపేట్‌ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్‌హిల్స్‌‌లోని కేంద్రానికి ఆదివారం సా. పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు. ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.