India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు, రిటర్నింగ్ అధికారుల తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లా వ్యాప్తంగా 1,534 కేసుల్లో రూ.49.72 కోట్లకు పైగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా ఉంటుందని అన్నారు.
ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
HYD బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు ప.గో. జిల్లాకు చెందిన చెవల మహేశ్ తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత సీఎం కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటేయనుండగా ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ NTR, ప్రణతి, BSNL సెంటర్‌లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఓటేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు ఓటేయనున్నారు.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ రేపు ఓటేసేందుకు రావాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019 పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్రులకు 5,173 ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 5,653 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ముందస్తు ఎత్తుగడలతో వివిధ పార్టీల నేతలు స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. స్వతంత్రులు, నోటాకు వచ్చిన ఓట్లు గెలుపోటములపై కీలకంగా మారుతున్నాయి.
పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. 2 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈవీఎంలు సాయంత్రం 4 వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయి.
రాష్ట్రంలోనే HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాల్లో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికల అధికారులు టార్గెట్-80 శాతం పేరిట ప్రజల్లో అవగాహన కల్పించారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా ఈవీఎం యంత్రాలను వినియోగించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఒక్కో EVM యంత్రంలో నోటా, 15 మంది అభ్యర్థులను మాత్రమే అమర్చగలిగే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.
HYD పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1991 పార్లమెంటు ఎన్నికల్లో 77.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ సమయంలో 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం. 1984లో 76.8, 1989లో 71.3, 1998లో 73.2, 2019లో 53.4 ఓటింగ్ శాతం నమోదయింది. 2024 ఎన్నికల్లో ఆ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టిద్దాం. అందరం ఓటు వేద్దాం.
Sorry, no posts matched your criteria.