Hyderabad

News April 15, 2024

HYD: కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ తయారీ!

image

HYD తార్నాక IICT సైంటిస్టులు కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాడ్మియం సల్ఫైడ్, సెమీకండక్టర్లతో కూడిన ఆకుల పై సూర్యరశ్మి పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయనిక చర్య జరుగుతుందని, తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుందని, చాలా తక్కువ ఖర్చుతో పారిశ్రామిక అవసరాలకు హైడ్రోజన్ తయారు చేసుకోవచ్చన్నారు.

News April 15, 2024

HYD: MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో నూతన వసతులు

image

HYD నగరంలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన వసతులను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దవాఖానను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆసుపత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు వేచి ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు అత్యధిక రోబోటిక్ శస్త్ర చికిత్సలు, కీమోతెరపి, స్కానింగ్ సహా అనేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

HYD: కంటోన్మెంట్ చరిత్రలోనే ఇది రెండవ ఉపఎన్నిక..!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే మే 13వ తేదీన జరగనున్న ఎన్నిక రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉపఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది. BRS నుంచి లాస్య నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ బరిలో ఉండగా.. బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.

News April 15, 2024

హైదరాబాద్‌: నేడే చివరి అవకాశం

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమి ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల ఆన్‌లైన్ శిక్షణకు HYD, RR, MDCL,VKB జిల్లాల యువతి, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు https://www.nacsindia.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.SHARE IT

News April 14, 2024

HYDలో అంబేడ్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి

image

డా.బీఆర్‌ అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, BRS సోషల్ మీడియా నేత చందు షేక్స్ విమర్శించారు. సచివాలయం పక్కనే ఉన్న భారీ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించలేదని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఇలాంటి ప్రతీకారాలు రాజకీయాల్లో ఒకే, కానీ రాజ్యాంగ ప్రాధాత, జాతిపితతో వద్దు అంటూ గంటా చక్రపాణి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

News April 14, 2024

HYD: ఫామ్ హౌస్‌పై పోలీసుల రైడ్స్

image

HYD శివారులోని ఓ ఫామ్‌హౌస్‌‌పై పోలీసులు రైడ్స్ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి‌లోని వ్యవసాయ క్షేత్రంలో విదేశీ మద్యం‌ అమ్ముతున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం మెరుపుదాడులు చేసిన బృందం పలు రకాల ఫారిన్‌ లిక్కర్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ జరిగే పార్టీలకు అక్రమంగా విదేశీ మద్యం సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

News April 14, 2024

HYD: ఆగస్టులోనే మాస్టర్‌ ప్లాన్!

image

HYD నగరంలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. డీపీఆర్, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించారు. 2024 ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని MRFDC ఎండీ ఆమ్రపాలి చెప్పారు. మొదటిదశలో ఉస్మాన్‌సాగర్ నుంచి గౌరెల్లి ORR, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55KM మూసీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు.

News April 14, 2024

HYD: ప్రజా పోరాటంతో తెలంగాణ సాధించాం: KTR

image

KCR సారథ్యంలో విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజల పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. HYD తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు స్ఫూర్తితోనే కేసీఆర్ 14 ఏళ్లు ముందుండి తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు.

News April 14, 2024

నివాళి: జార్జ్ రెడ్డి హత్యకు నేటికి 52 ఏళ్లు

image

‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా సుపరిచితుడు. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1962‌‌లో జార్జ్ ఫ్యామిలీ నగరంలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్.. OUలో పీజీ చేశారు. యూనివర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే దారుణంగా హత్యచేశారు. నేడు జార్జ్ 52వ వర్ధంతి.

News April 14, 2024

HYD: 10TH పాసైన వారికి సువర్ణ అవకాశం

image

HYD బాలానగర్‌లోని CITDలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి పాసైన వారు మే 13 వరకు https://citdindia.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ బ్రాంచీలు ఉన్నాయి.