Hyderabad

News April 14, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో తగ్గిన బోట్ షికారు

image

HYD హుస్సేన్ సాగర్‌లో బోట్ షికారు చేసే వారి సంఖ్య తగ్గింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బోట్ షికారు చేసిన వారు 2 వేల మంది వరకు ఉండగా.. శని, ఆదివారాలు 5 వేల మంది ఉంటున్నారు. సాగర్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు 100 మంది సామర్థ్యం ఉన్న పెద్ద బోట్లలో పుట్టిన రోజు వేడుకలు, కుటుంబ సభ్యుల సమావేశాలు జోరుగా సాగేవి. ఓ వైపు ఎండ, మరోవైపు హుస్సేన్ సాగర్ దుర్వాసన కారణంగా షికార్ చేసే వారి సంఖ్య తగ్గింది.

News April 14, 2024

BREAKING: HYD: విద్యార్థి SUICIDE

image

నీట్ పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. స్ప్రింగ్ కాలనీలో ఉంటున్న జైస్వాల్(22) నీట్ పరీక్షపై ఆందోళనకు గురై.. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2024

HYD: హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు!

image

HYD హిమాయత్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2.128 టీఎంసీలు ఉండగా.. నగరానికి 26 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం అడుగులో కలుషితాలు పేరుకుపోవడంతో 10 అడుగులపై నుంచి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. పంపింగ్ ద్వారా నేరుగా మీర్ ఆలం నీటి శుద్ధి కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు వస్తున్నట్లు గుర్తించారు.

News April 14, 2024

HYD: EMERGENCY పంపింగ్‌కు చర్యలు

image

HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమెర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.

News April 14, 2024

HYD: పిల్లలను షాప్‌కు పంపుతున్నారా.. జర జాగ్రత్త!

image

అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఆరేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మలక్‌పేట్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సలీంనగర్ వాసి సుబ్బారావు(52)కు ముసారాంబాగ్‌లో కిరాణా షాప్ ఉంది. దుకాణానికి వచ్చిన ఓ చిన్నారి(6)తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.

News April 14, 2024

HYD: తిరుపతి వెళ్లేవారే TARGET.. జర జాగ్రత్త..!

image

తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్‌గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్‌కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

News April 14, 2024

HYD: ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD సూరారం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్ వాసి తన్వీర్ ఖాన్(27)కు మూడేళ్ల క్రితం వివాహమవగా బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చి దయానంద్ నగర్‌లో ఉంటున్నాడు. కాగా పెళ్లికి ముందు అతడు ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. విషయం తెలిసి తన్వీర్ ఉరేసుకుని చనిపోయాడు. శనివారం కేసు నమోదైంది.

News April 14, 2024

మాదాపూర్‌లో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

image

HYD మాదాపూర్ పరిధి అన్నమయ్యపురంలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. ఇందులో వినాయక కొతం, మూషికవాహన, ముద్దుగారే యశోద, ఇదిగో భద్రాద్రి తారంగం, అంబ పలుకు, మీనాక్షి పంచరత్న తదితర అంశాలను కళాకారులు శ్రీవిద్య, సహస్ర, శ్రీమయి, శాన్వి, మహిశ్రీ తదితరులు కలిసి ప్రదర్శించారు.

News April 14, 2024

HYD: ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని, మే 2 వరకు జరుగుతాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి HYDలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో సెషన్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 14, 2024

HYD: ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు

image

అర్హులైన యువతీ, యువకులు ఓటుహక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని HYDలో అధికారులు తెలిపారు. అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 15 వరకు అవకాశం ఉందని, గ్రామ స్థాయిలో VLO, మండల స్థాయిలో తహశీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో గడువులోగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.