India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.
HYD దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.
HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రేటర్ HYDలో పిల్లల ఆరోగ్య రక్షణ కోసం వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధవారం చిన్నారులకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాలు, నిలోఫర్ వంటి ప్రసూతి, చిన్నపిల్లల దవాఖానల్లో ప్రతిరోజు వ్యాక్సిన్లు, టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.
ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిశాంక్ అరెస్ట్ అక్రమమని, కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. HYD బోయిన్‌పల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తలసాని.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను గెలిపించాలని కోరారు. BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
HYD మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ఈరోజు రా.1 గంట వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 12:15 గంటలకి చివరి ట్రైన్ ప్రారంభమై 1:10 గంటలకి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ఉప్పల్ స్టేడియం, NGRI స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఉప్పల్ మార్గంలో మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగేవారికి అనుమతి ఉంటుందని, ఎక్కడానికి వీలు ఉండదని సృష్టం చేసింది.
ట్యాంక్‌బండ్‌లో ఓ యువకుడి ప్రాణాలను GHMC DRF సిబ్బంది కాపాడారు. గురువారం ఉదయం అప్పర్ ట్యాంక్‌బండ్ మీదకొచ్చిన వంశీ అనే యువకుడు నీళ్లలోకి దూకాడు. మునిగిపోతున్న అతడిని గమనించిన DRF సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటినా ట్యాంక్‌బండ్‌లోకి దిగి అతడిని బయటకు తీసుకొచ్చారు. లేక్ పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, కార్పొరేటర్ విజయారెడ్డి కోరారు. గురువారం కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. BRS నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, తప్పకుండా గెలుస్తామని అన్నారు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో BJP సీనియర్ నేత బండారు దత్తాత్రేయ 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఎన్నికలు, ఉప ఎన్నికలు కలిపి ఇక్కడ నుంచి ఎక్కువ సార్లు పోటీ చేసింది కూడా ఆయనే. 1991లో తొలిసారి గెలవగా 1998, 1999, 2014లో గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 1984, 1996, 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో వాజ్‌పేయి హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.