Hyderabad

News April 12, 2024

HYD: యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు

image

మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై కాచిగూడ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కి తరలించారు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్ నగర్‌కు చెందిన బాలాజీ వృత్తి రిత్యా కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాచిగూడ పీఎస్ పరిధిలోని ఓ బస్తీకి చెందిన మైనర్ బాలికను బాలాజీ 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

News April 12, 2024

HYD: రోజురోజుకి నగరంలో పెరుగుతున్న కాలుష్యం

image

HYD నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. నగరంలో నమోదవుతున్న కాలుష్య స్థాయిల్లో సింహభాగం రవాణా విభాగం నుంచే ఉంటోందనేది పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 40 మైక్రోగ్రాములకు మించొద్దు. సనత్ నగర్, ఇక్రిశాట్, జూపార్కు, పాశమైలారం ప్రాంతాల్లో అంతకు మించి నమోదైనట్టు పీసీబీ నివేదికలు వెల్లడించాయి.

News April 12, 2024

HYD సెంట్రల్ యూనివర్సిటీకి WORLD ర్యాంకింగ్

image

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో HYD నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి చోటు దక్కింది. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో ర్యాంకు దక్కగా.. పర్ఫార్మింగ్ ఆర్ట్ సబ్జెక్టుకు 101-150(బ్యాండ్) ర్యాంకు దక్కినట్లుగా యూనివర్సిటీ తెలిపింది. బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్‌కు గత ర్యాంకులే ఉన్నాయి. ఫిజిక్స్ ర్యాంకు మాత్రం మెరుగుపడ్డట్లుగా తెలిపింది.

News April 12, 2024

HYDలో DSC ఫౌండేషన్ కోర్స్ FREE

image

HYD నగరంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల బాలికల హాస్టల్ దిల్‌సుఖ్ నగర్ కాంప్లెక్స్ వద్ద షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 2 నెలల డీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఏదైనా బీఈడీ చేసి, టెట్ అర్హత కలిగి, ఏడాదికి రూ.3 లక్షలలోపు కుటుంబ ఆదాయం ఉన్న ఎస్సీ యువతి యువకులు అర్హులని తెలిపారు. కాగా, దిల్‌సుఖ్ నగర్ కాంప్లెక్స్ వద్ద స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు.

News April 12, 2024

మైలాపూర్: రిజర్వ్ బ్యాంక్ ప్లేస్‌లో చిల్డ్రన్స్ బ్యాంక్

image

మైలాపూర్ దేవులపల్లి PS పరిధిలో నకిలీ కరెన్సీ ముఠా కేసులో పోలీసులకు ట్విస్ట్ ఎదురైంది. పట్టుబడ్డ దుండగులు నోట్లు అచ్చం మక్కీకి మక్కీ చేశారు. కానీ ఓ దగ్గర పొరపాటు చేశారు. రిజర్వ్ బ్యాంకు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ముద్ర వేశారు. మల్కాజిగిరిలో డీల్ కుదరక మైలార్ దేవులపల్లికి వచ్చి హోటల్‌లో పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. అయితే రిజర్వ్ బ్యాంకు అని ఉంటే గుర్తు పట్టడం కష్టమని పోలీసులు తెలిపారు.

News April 12, 2024

చేవెళ్లలో BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ZPTC

image

చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.

News April 12, 2024

హైదరాబాద్‌‌‌లో‌ వెదర్ అప్‌డేట్‌

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నగరంలో వెదర్ కాస్త చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదు అయ్యే ఛాన్స్‌ ఉందని ప్రకటన విడుదల చేసింది. SHARE IT

News April 12, 2024

హైదరాబాద్‌: పండుగ రోజు అమానుష ఘటన (UPDATE)

image

HYDలో రంజాన్ వేళ అమానుష ఘటన వెలుగుచూసింది. రామాంతపూర్‌ ప్రిన్స్‌టన్ కాలేజ్ సమీపంలో 2, 3 రోజుల వయస్సు కలిగిన మగశిశువు మృతదేహాన్ని(తొంటి నుంచి తొడ భాగాన్ని) కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. <<13031707>>శిశువు చనిపోయాక<<>> గుర్తుతెలియని వారు చెత్త డబ్బాలో పారేసి వెళ్లినట్లు‌ భావిస్తున్నారు.

News April 12, 2024

HYD: ట్యాంకర్లకు డిమాండ్.. ఇంటి ఓనర్లకు నోటీసులు!

image

జలమండలి కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 31,706 మంది నీటి ట్యాంకర్ల‌ను ఆశ్రయిస్తున్నట్లు గుర్తించింది. భూగర్భ జలాలు, బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల డిమాండ్‌కు ప్రధాన కారణమని తేల్చారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించడం కోసం NGO ప్రతినిధులను ఇంటికి పంపి అవగాహన కల్పించనున్నారు. నీటి సంరక్షణకు ఇంటి యజమానులు ఇంకుడు గుంతలు నిర్మించుకొనేలా నోటీసులు అందజేయనున్నారు.
SAVE WATER

News April 12, 2024

సికింద్రాబాద్ నుంచి కోళ్లం వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్

image

సికింద్రాబాద్ నుంచి కోళ్లం వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ అందుబాటులోకి తేనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 12, 19, 26 తేదీలలో సాయంత్రం 6:40 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కొట్టియాం, పరిపల్లి, కోళ్లం వెళ్లాలనుకునేవారు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.