Hyderabad

News April 12, 2024

HYD: RRR గ్రీన్ బెల్ట్.. 110 జోన్లుగా అభివృద్ధి?

image

HYD శివారు RRR ప్రతిపాదిత గ్రీన్ బెల్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చే 1.10 లక్షల ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్, అగ్రి బిజినెస్ వ్యాపారాలు చేపట్టవచ్చని, దీనికి సంబంధించి JNTU ఆచార్యులు కే.లక్ష్మణరావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 110 గ్రీన్ జోన్లుగా విభజిస్తే సాధ్యమవుతుందని, ఒక్కో జోన్‌లో 1000 ఎకరాల్లో 200-400 ఎకరాల చెరువులు, మిగతా 600 ఎకరాల్లో అగ్రి బిజినెస్ చేయొచ్చని తెలిపారు.

News April 12, 2024

HYD: TOP యూనివర్సిటీలకు A, A+గ్రేడ్

image

HYD నగరంలోని JNTUH A+గ్రేడ్, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ A గ్రేడ్ సాధించినట్లు ఆయా యూనివర్సిటీలు వెల్లడించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు విదేశీ కోర్సులతో ఒప్పందాలు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టినందుకు సులభతరం కానుంది. గ్రేడ్స్ రావడం పట్ల విద్యార్థులు, అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేసింది. A, A+గ్రేడ్లు సాధించిన నేపథ్యంలో సదుపాయాల కల్పనలో మరింత ముందుకు వెళ్లే అవకాశం లభించనుంది.

News April 12, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో పంపింగ్ స్టేషన్లకు ప్రణాళిక!

image

HYD నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నీటి పై తేలియాడే ఫ్లోటింగ్ పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. నీటిమట్టాలు తగ్గడం, డెడ్ స్టోరేజీ పడిపోయినప్పుడు ఎమర్జెన్సీ పంపింగ్ చేసే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో తగ్గితే ఇబ్బందులు లేకుండా అప్రోచ్ ఛానల్ ద్వారా నీటిని పంప్ చేసి, శుద్ధి చేయనున్నారు.

News April 11, 2024

హైదరాబాద్: BRS, కాంగ్రెస్, MIM ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో‌ అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్‌ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.

News April 11, 2024

హైదరాబాద్‌ మెట్రోలో ఇదీ పరిస్థితి!

image

కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, బేగంపేట, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద ఉదయం, సాయంత్రం రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లకు మొత్తం 171 కోచ్‌లున్నాయి. అదనంగా 40 నుంచి 50 తీసుకొస్తామని మెట్రో గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీకామెంట్?

News April 11, 2024

HYD: త్వరలో సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్!

image

HYD నగరంలో మంచినీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నెలకు 2.5 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని, త్వరలో నాగార్జునసాగర్ ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నగర ప్రజలకు నీరు అందించనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

News April 11, 2024

HYD: రంజాన్ మాసంలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు

image

రంజాన్ మాసంలో HYD నగరంలో 10 లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 6 మిలియన్ ప్లేట్ల బిర్యాని ఆర్డర్లు వచ్చాయని, గతేడాదితో పోల్చితే 15% పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, భోపాల్, మీరట్ నగరాల్లో కొనుగోళ్లను పరిశీలించగా.. ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.

News April 11, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం

image

యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని కాచిగూడ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలిచారు. SI సుభాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉంటున్న యువతి (29) ప్రైవేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. సత్యానగర్‌ వాసి అఖిల్ (30)‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ముఖం చాటేయడంతో‌ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

News April 11, 2024

హైదరాబాద్‌‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. SHARE IT

News April 11, 2024

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.