Hyderabad

News May 8, 2024

HYD: వామపక్షాల మద్దతు లేకుండా కాంగ్రెస్‌ గెలవదు: MLA

image

లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. మంగళవారం HYD బషీర్‌బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆ పార్టీని ఓడించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

News May 8, 2024

HYD: 48 శాతం మహిళా ఓటర్లే.. పార్టీల ఫోకస్!

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి ఏకంగా 53,80,594 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,10,36,044 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో ఇతరులు 1138 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 51 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. 48 శాతం మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారిని ఆకట్టుకునేలా ప్రచారాలు చేస్తున్నారు.

News May 8, 2024

Respect: హైదరాబాద్‌‌లో మీ సేవలకు సలాం

image

అకాల వర్షం రాజధానిని అతలాకుతలం చేసింది. సాయంత్రం మొదలైన గాలివాన మిడ్‌నైట్ వరకు ముప్పుతిప్పలు పెట్టింది. విరిగి పడుతున్న చెట్ల కొమ్మలు, పొంగుతున్న మ్యాన్‌హోల్స్‌, కిలో మీటర్ల‌ మేర ట్రాఫిక్‌ జామ్‌ను దాటి ఎట్టకేలకు ఇళ్లకు చేరిన ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో GHMC సిబ్బంది, HYD ట్రాఫిక్ పోలీసులు‌ ఎంతో కష్టపడ్డారు. భారీ వర్షంలో తడుస్తూనే వరదను నాలాలకు మళ్లించారు. మీ సేవలకు సలాం.

News May 7, 2024

హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెస్తా: CM రేవంత్ రెడ్డి

image

రాజధాని‌లోని 4 స్థానాలపై‌ CM రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నిన్న ఉప్పల్, అంబర్‌పేట, కంటోన్మెంట్‌లో రోడ్‌షో‌లు నిర్వహించారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు. ‘నగరం నమ్మకం పెట్టుకుంది. గల్లి గల్లీల గజమాలలతో స్వాగతం చెప్పింది. అంబర్‌పేట సంబురమైంది. కంటోన్మెంట్ కోలాటమాడింది. మాట ఇస్తున్నా. మన నగరానికి పూర్వవైభవం తెస్తా. బస్తీల ముఖచిత్రం మారుస్తా’ అంటూ పేర్కొన్నారు.

News May 7, 2024

HYD ప్రజలకు మెట్రో GOOD NEWS

image

HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.

News May 7, 2024

HYD నుంచే నక్షత్రాలు, గ్రహాలను చూడొచ్చు..!

image

HYD సెంట్రల్ యూనివర్సిటీలో మినీ అబ్జర్వేటరీ అందుబాటులోకి వచ్చింది. నక్షత్రాలు, గ్రహాలను ఇక్కడి నుంచే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా ఆధ్వర్యంలో నిజం అబ్జర్వేటరీ, హైదరాబాద్ ఐఐటీలో మరో కేంద్రం అందుబాటులో ఉంది. దీని ద్వారా వాయు కాలుష్య తీవ్రతను సైతం అంచనా వేయొచ్చని, నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణాన్ని అధ్యయనం చేయొచ్చని ప్రొఫెసర్ ఉదయగిరి తెలిపారు.

News May 7, 2024

HYD ప్రజలకు అలర్ట్.. వర్షం పడే ఛాన్స్!

image

HYD ప్రజలకు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల్లో నేడు 40KMPH వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా నీరు నిలిచినా.. అత్యవసర పరిస్థితులు ఏర్పడినా 040-21111111, 9000113667 కాల్ చేసి తెలియజేయాలన్నారు.

News May 7, 2024

HYD: ‘గడిచిన 24 గంటల్లో రూ.15,70,000 నగదు సీజ్’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

HYD: ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీజీ

image

HYD తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏడాది పాటు ఈ కోర్స్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి వచ్చి ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతా వివరాలకు https://www.efluniversity.ac.in సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 7, 2024

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసులు నమోదు

image

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.