India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆకుపచ్చ రంగు బాక్సులో ఉన్న MSL మార్కింగ్ రైల్వే స్టేషన్ బోర్డు పై ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. HYD చర్లపల్లి స్టేషన్ బోర్డు పై MSL+525.05M అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 525.05 మీటర్ల పైన ఉన్నట్లు అని రైల్వే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. MSL అనగా మీన్-సి-లెవెల్(సగటు సముద్రమట్టం) అని పేర్కొన్నారు.
గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీని సక్సెస్‌గా చేసి, పేషంట్ ప్రాణాలు కాపాడారు. నాందేడ్ (MR)కు చెందిన సంధ్య (11) అనే బాలిక బ్లడ్‌ప్రెషర్, తలనొప్పి, మైకం, చెమట, వాంతులు తదితర ఆరోగ్య సమస్యలతో గాంధీలో అడ్మిట్ అయింది. స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు బాలిక కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు గుర్తించారు. లాపరోస్కోపిక్‌తో తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.
బోనాల పండుగకు 2 నెలల ముంగిట HYDలో విషాదం నెలకొంది. లష్కర్‌లోనే ఫేమస్ పోతరాజు చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న దినేశ్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లు తెలిసింది. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉండే ఈ పోతరాజు 15 ఏళ్ల నుంచి ఉజ్జయిని టెంపుల్ వద్ద గంభీరమైన ఆకారంతో భక్తులకు కనిపించేవారు. ఎన్నో ఏళ్లుగా వేషం వేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించారు. దినేశ్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.
కడ్తాల్ సమీపంలోని మక్తమాదారం బటర్‌ఫ్లై వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదగిరికి గతేడాది రవీందర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే రవీందర్ భార్య గీత, యాదగిరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రవీందర్‌ను అంతమొందించాలని భార్య, ప్రియుడు భావించారు. అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. విచారణలో పోలీసులకు చిక్కారు.
HYD నగరంలో రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతోంది. అర్బన్ ల్యాబ్స్ రీసెర్చ్ మార్చ్-2024 ప్రకారంగా అర్బన్ హీట్ ఐలాండ్ జోన్ల వివరాలను అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్ ప్రాంతాలు హీట్ జోన్లుగా పేర్కొన్నారు. మరోవైపు రోజు రోజుకు GHMC పరిధిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ మోసాలకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులపై దేశ వ్యాప్తంగా 600 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన 77 కేసుల మిస్టరీ వీడిందని తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3.12 కోట్లు జప్తు చేశామని, దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
HYD మెహిదీపట్నంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. దీంతో భారీ క్యూ లైన్ ఏర్పడుతుంది. దీన్ని అదునుగా చేసుకొని సెక్యూరిటీ చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్యూ లైన్‌లో చివరలో ఉన్నా.. డబ్బులు ఇస్తే అందరికంటే ముందే స్టాంపు వేయించుకుని వైద్యం పొందవచ్చని రోగులు తెలిపారు. ఆసుపత్రిలో ఉచిత వైద్యమని బోర్డులు పెట్టి, ఇలా చేతివాటం చూపిస్తున్నారని వాపోయారు.
కొద్ది రోజులుగా HYDలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్డ్, లైట్ బీర్లు, టిన్‌లు ఇలా వివిధ రకమైనవి అందుబాటులో లేవని వైన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని మద్యం ప్రియులు అంటున్నారు. అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని కోరుతున్నారు. పలు షాపుల వద్ద నో బీర్లు అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సాయన్న బిడ్డ నివేదితను గెలిపిస్తామని మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఇన్‌ఛార్జ్ శ్రీధర్, కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదితో కలిసి ఆయన మాట్లాడారు. KCR వైపే ప్రజలు ఉన్నారన్నారు.
HYD, ఉమ్మడి RRలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత, వేడి గాలులతో అవస్థలు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇటీవల యూసుఫ్‌గూడలో ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. తాజాగా చేవెళ్ల పరిధి ఇబ్రహీంపల్లిలో ఎండ వేడికి జాజుగుట్టకు చెందిన అహ్మద్ కారు అద్దాలు పగిలిపోయాయి. మధ్యాహ్నం ఇంటి ముందు కారు పెట్టగా ఎండకి అద్దాలు పగిలిపోయాయని బాధితుడు తెలిపాడు.
Sorry, no posts matched your criteria.