Hyderabad

News April 9, 2024

HYD: ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

image

రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండ దంచికొట్టింది. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 40.6 డిగ్రీలు, శేరిలింగంపల్లి ప్రాంతంలో 39.8 డిగ్రీలు, ఉప్పల్‌ పరిధి మారుతీనగర్‌లో 39.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 9, 2024

HYD: 3 లక్షల ఓట్ల మెజారిటీ ఖాయం: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

image

చేవెళ్ల ఎంపీగా 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో తాను గెలుస్తానని విశ్వేశ్వర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పేరుతో లక్ష ఓట్లు మెజారిటీ, మరో రెండు లక్షల మెజారిటీని మాత్రం కార్యకర్తల పేరుతోనే సాధించనున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. హనుమంతుడి గుడిని కూల్చిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.

News April 9, 2024

శంషాబాద్: ముచ్చింతల్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు

image

HYD శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో హీరో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌కు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. వీరి కలయికను చూసిన టీమ్ సభ్యులు తెగ సంబరపడి పోయారు. సోమవారం ముగ్గురు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉన్నారని తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.

News April 9, 2024

HYD: బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక

image

HYD బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఓ హోటల్‌లో సోమవారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ అభిమానులను కలిశారు. పుష్ప సినిమా హీరోయిన్‌ను చూసేందుకు.. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

News April 8, 2024

HYD మెట్రో‌లో‌ మహిళలకు FREE జర్నీ కల్పించాలని డిమాండ్

image

మహిళల‌ సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉప్పల్‌ మాజీ MLA NVSS ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రో, MMTSలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు ఉండాలన్నారు. కానీ, ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలు అభివృద్ధి కోసం జరిగేవని, కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవొద్దు అంటూ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 8, 2024

Water Crisis: హైదరాబాదీ ఇకనైనా మేలుకో!

image

HYDలో విచ్చలవిడిగా‌ నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్‌ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్‌ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్‌ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER

News April 8, 2024

HYD: DGP సాయం.. 32 మందికి పోలీస్ ఉద్యోగాలు

image

DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

News April 8, 2024

UPSC ప్రిపరేషన్ పై నారాయణ IAS అకాడమీ వర్క్ షాప్

image

సివిల్ అభ్యర్థుల కోసం నారాయణ IAS అకాడమి ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. ఏపీ రిటైర్డ్ CS మోహన్ కందా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మొదలైన ప్రముఖులు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రిపరేషన్‌లో రీసెర్చ్ & డెవలప్‌మెంట్‌ విధానాలు వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News April 8, 2024

BRS కంటోన్మెంట్ టికెట్.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

image

BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.

News April 8, 2024

HYD: రూ.7,30,400 నగదు సీజ్: రోనాల్డ్ రాస్ 

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.