Hyderabad

News April 8, 2024

HYD: ఆర్టీసీని వేధిస్తున్న సిబ్బంది కొరత!

image

ఆర్టీసీలో పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. HYDలోనూ రద్దీ ఉంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.ఈఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో1,354 మంది పదవీ విరమణ కానున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

News April 8, 2024

HYD ప్రజలకు GOOD NEWS.. తగ్గనున్న ఎండ!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.

News April 8, 2024

హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా: MP అభ్యర్థి

image

లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని BRS నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్‌ పరిధి గన్‌ఫౌండ్రిలో BRS సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRS HYD అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. KCRతోనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.

News April 8, 2024

HYD: చెరువుల్లో గుర్రపు డెక్క సమస్య..!?

image

గ్రేటర్ HYDలో మొత్తం 185 చెరువులు ఉండగా వాటిలోని 50 తటాకాల్లో ప్రస్తుతం గుర్రపు డెక్క మొక్క దాదాపు 100% పరుచుకొని ఉంది. రెండేళ్లుగా ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క వ్యర్థాలను తొలగించేందుకు తూతూ మంత్రంగా పనులు జరగగా.. దీనికి తోడు గుర్రపు డెక్కను తొలగించే FTC యంత్రాల కాంట్రాక్ట్ ఫిబ్రవరితో పూర్తయింది. దీంతో ఆ కొద్దిపాటి పనులు సైతం మూలన పడ్డాయి. మరీ అన్ని చెరువుల్లో ఎప్పుడు తొలగిస్తారో..? వేచి చూడాలి.

News April 8, 2024

RR: కేసులు పెండింగ్.. నూతన కమిషన్ కోసం డిమాండ్!

image

కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

News April 8, 2024

HYD: మరో 2 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలోనూ!

image

HYDలో గత BRS ప్రభుత్వం గాంధీ దవాఖానకు సుమారు రూ.16 కోట్లతో అత్యాధునిక MRI యంత్రాన్ని సమకూర్చింది. దీంతో ప్రస్తుతం గాంధీలో MRI సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రికి సైతం గత ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతుండగా.. మరో 2 నెలల్లో MRI స్కానింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

News April 8, 2024

HYD: ఆ ప్రాజెక్ట్‌తో నెలకు రూ.16 లక్షల ఆదాయం!

image

HYD శివారు ORRకు సమాంతరంగా గత BRS ప్రభుత్వం నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 13 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని HMDA అధికారులు వెల్లడించారు. నెలకు దాదాపు రూ.16 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ విద్యుత్‌ను రహదారులపై లైటింగ్ సహా, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలియజేశారు.

News April 8, 2024

HYD: ప్రజల్లోకి కాంగ్రెస్ మేనిఫెస్టో..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో నేటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు రోజుకు రెండుసార్లు పార్లమెంట్ నియోజకవర్గాల్లో NSUI ప్రచారం చేయాలని నిర్ణయించింది. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రోగ్రాంలో కాంగ్రెస్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ నేతలు, తదితరులు అందరూ పాల్గొననున్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ఫుల్ ఫోకస్ పెట్టామని నేతలు తెలిపారు.

News April 8, 2024

HYD: చివరి దశలో ORR ట్రంపెట్‌ పనులు

image

ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత BRS ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌ను HYD మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియో పోలీస్‌ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ORR ట్రంపెట్‌ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2024

గ్రేటర్ HYDలో పెరిగిన బీర్ల విక్రయాలు

image

గ్రేటర్ HYDలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌లో 60 నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 20 వేల కేసులకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదని టాక్. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు అంటున్నారు.