Hyderabad

News May 4, 2024

HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

image

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.

News May 4, 2024

HYD: హోటల్లో తేదీ గడిచిన జున్ను, సాండ్విచ్ విక్రయం

image

HYD హిమాయత్ నగర్ క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ పై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో హోటల్ యజమాన్యం చేసే తప్పులు బయటపడ్డాయి. తేదీ గడిచిన జున్ను, సిరప్, సాండ్విచ్, బ్రౌన్ షుగర్ గుర్తించారు. ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతికున్న బొద్దింకలను గుర్తించారు. మురిగిన క్యారెట్లు, కొన్ని రోజుల వెజ్ బిర్యానీ ఫ్రిజ్లో గమనించి నోటీస్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

News May 4, 2024

HYD: బీజేపీ వస్తే రాజ్యాంగ మనుగడ కష్టం: నారాయణ

image

కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే.నారాయణ ఆరోపించారు. HYD హిమాయత్‌నగర్ మఖ్దుమ్ భవన్‌లో శనివారం సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు.

News May 4, 2024

HYD: పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన ఓటింగ్ ఉన్న సందర్భంలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం పార్లమెంట్, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: 852 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు..

image

హైదరాబాద్‌లో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లాలో మొత్తం మొదటి రోజున 852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News May 4, 2024

HYD: హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు ఇతనే..!

image

HYD అత్తాపూర్ PS పరిధి హసన్‌నగర్‌లో ఓ కాంగ్రెస్‌ నాయకుడు కాసేపటి క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రామిరెడ్డి తెలిపిన వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో <<13182707>>కాంగ్రెస్ నాయకుడు మక్బూల్‌‌‌ను<<>> అంజాద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్బూల్ పాల్గొనగా అందరూ చూస్తుండగానే అంజాద్ అతడిని చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 4, 2024

BREAKING: HYD: కాంగ్రెస్ నాయకుడి MURDER

image

HYD అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో అందరూ చూస్తుండగానే ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసేపటి క్రితం హసన్ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని దుండగుడు అక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకుడిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 38 ఎస్కలేటర్లు..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా 38 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 5 ఎకరాల స్టేషన్ విస్తీర్ణంలో పై అంతస్థుల్లో కూడా పచ్చిక బయళ్లు, మొక్కలు, పార్కులు ఉండేలా చూస్తున్నారన్నారు. స్టేషన్‌లో జనం ఉంటేనే లైట్లు వెలిగే సిస్టం అందుబాటులోకి తేనున్నారు.

News May 4, 2024

RR, మేడ్చల్ జిల్లా ప్రజలకు GOOD NEWS

image

గాంధీ, ఉస్మానియా వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు 100 సీట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు.RRజిల్లా కందుకూరు, మేడ్చల్ జిల్లా చింతల్‌లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వైద్య కళాశాలల విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఆసుపత్రులను నిర్ణయించనున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా.. ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది.

News May 4, 2024

HYD: ‘పండ్ల నాణ్యతపై అనుమానం వస్తే.. ఇలా చేయండి’

image

HYDలో వేసవి వేళ కెమికల్ రసాయనాలతో కాయలను పండ్లుగా మార్చి విక్రయిస్తున్న వారి పై అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అందిన ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా మగ్గబెడితే జస్ట్ వాట్సప్ ద్వారా 9100105795కు ఫొటోలు పంపిస్తే అక్కడికి చేరుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యతపై అనుమానం వస్తే 040-211111111కు కాల్ చేసి తెలియజేయాలన్నారు.