Hyderabad

News April 6, 2024

HYD: రూ.6,53,35,400 నగదు సీజ్ చేశాం: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో HYDలో గడిచిన 24 గంటల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,53,35,400 నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 80.65 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామన్నారు. రూ.65,390 విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కారం చేశామన్నారు.

News April 6, 2024

HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు.

News April 6, 2024

HYD: శంషాబాద్‌లో MURDER.. నిందితుడి అరెస్ట్

image

ఓ మహిళ హత్యకు గురైన ఘటన HYD శంషాబాద్ పరిధి సంఘీగూడ శివారులో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ పరిధి పాలమాకులకు చెందిన యాదమ్మను శంకరయ్య అనే వ్యక్తి హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

HYD: ఎవరిని ఎవరు తొక్కుతారో చూద్దాం: మంత్రి

image

మాజీ సీఎం KCR వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శనివారం HYD గాంధీభవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రచ్చ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రోడ్లపైనే ఉంటారు. ఎవరు వస్తారో రండి, చూసుకుందాం. ఎవరిని ఎవరు తొక్కుతారో తేలుతుంది. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు. BRS పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.

News April 6, 2024

HYD: వామ్మో ఎండ.. AC బస్సుల్లో రద్దీ

image

HYDలో ఎండ దంచి కొడుతోంది. దీంతో నగరంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు మహిళలు సైతం పైసలైనా సరే.. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య వేసవి వేళ పెరుగుతోంది. మరికొంత మంది ప్రయాణికులు మెట్రోను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులతో అటు మెట్రో, ఇటు ఏసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి.

News April 6, 2024

HYD: KCR హయాంలోనే అభివృద్ధి జరిగింది: రాగిడి

image

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.

News April 6, 2024

SR నగర్‌లో యువతిని ఢీకొట్టింది ఇతనే..!

image

HYD SR నగర్‌లో ఓ <<13001120>>యువతి స్కూటీని ముగ్గురు<<>> టీనేజర్లు బైక్‌తో ఢీకొట్టగా ఆమె కాలు విరిగి, తలకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఆ ముగ్గురు టీనేజర్లు వెళ్లిపోతుండగా స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు. స్పీడ్‌గా బైక్ నడిపిన వ్యక్తిని మందలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అబ్బాయిలకు సైతం గాయాలయ్యాయి. యువతితో పాటు వారిని కూడా ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.

News April 6, 2024

కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

image

ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు (నం.07653) ను మే 1 వరకు, శుక్రవారం.. తిరుపతి -కాచిగూడ (నం.07654) రైలు మే 2 వరకు, బుధవారం.. సికింద్రాబాద్‌ -రామగుండం (నం.07695) రైలును ఏప్రిల్‌ 24 వరకు రైల్వే శాఖ పొడిగించింది.

News April 6, 2024

HYD: నేడు ‘షబ్‌-ఎ- ఖదర్’.. రాత్రంతా జాగారం!

image

రంజాన్ మాసం నేపథ్యంలో ‘షబ్‌-ఎ- ఖదర్’ రాత్రి మరింత మహోన్నతమైంది. రంజాన్‌ మాసంలో 26వ ఉపవాసం(నేడు) రాత్రంతా భక్తి శ్రద్ధలతో ‘షబ్‌ -ఎ- ఖదర్’ జరుపుకుంటారు. HYD, ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా జగ్నేకి రాత్‌(జాగారం) నిర్వహించుకునేందుకు ముస్లింలు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆఖరి జుమాకు అల్విదా పలికారు.

News April 6, 2024

HYD: ఎండ మామూలుగా లేదుగా!

image

HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.