Hyderabad

News May 3, 2024

HYD: ప్రాణం తీసిన ఈత సరదా.. జర జాగ్రత్త!

image

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు జరగ్గా ఈరోజు మరో బాలుడు మృతిచెందాడు. HYD శివారు చేవెళ్ల పరిధి దేవుని ఎర్రవల్లిలో 10 మంది ఫ్రెండ్స్ కలిసి బావిలో ఈతకు వెళ్లారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు నాని నీట మునిగి చనిపోయాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు.

News May 3, 2024

జవహర్ నగర్: గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి(25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

image

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

BREAKING.. శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత

image

శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నారు. కాగా, 5 రోజులుగా అధికారులను చిరుత ఉక్కిరిబిక్కిరి చేసింది.

News May 3, 2024

ఉప్పల్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రమేశ్(70) ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి వెనకాల లేట్ మిషన్‌ను నడిపిస్తున్నాడు. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News May 3, 2024

HYD: చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు గాయాలు

image

చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

HYD: రూ.2,62,96,691 పట్టివేత

image

పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పోలీసులు ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీల్లో రూ.2,62,96,691 పట్టుబడింది. ఇందుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. మద్యం సరఫరాకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా.. రూ.10.83 లక్షల విలువచేసే 3,359 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

News May 3, 2024

ఖైరతాబాద్: ఈనెల 4న కాంగ్రెస్ ‘ఛలో నెక్లెస్‌రోడ్ “

image

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.

News May 3, 2024

HYD: ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.

News May 2, 2024

HYD: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కోర్ట్ ఉద్యోగులు

image

HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.