Hyderabad

News April 4, 2024

HYD: అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని డిమాండ్

image

HYD జిల్లాలో 36, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 29 అంబులెన్స్‌లు ఉన్నాయి. 108కి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెబితే గాని ఒక్కోసారి రావడం లేదని, HYD నగర శివారు మారుమూల ప్రాంతాలకు ఆలస్యమవుతుందని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరి నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని పలువురు కోరారు.

News April 4, 2024

HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్  అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.

News April 4, 2024

ఎవిస్ హాస్పిట‌ల్స్ కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్త‌ర‌ణ

image

వాస్క్యుల‌ర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. గురువారం కూక‌ట్‌ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభించారు. MD, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాల‌తో కొత్త ఆసుప‌త్రికి అంకురార్ప‌ణ చేశారు. కార్యక్రమంలో డైరెక్ట‌ర్లు శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్, డాక్ట‌ర్లు సంప‌త్, మ‌ల్లీశ్వ‌రి, బిందు, అధికారులు పాల్గొన్నారు.

News April 4, 2024

మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

image

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.

News April 4, 2024

ఓయూను ప్రభుత్వం ఆదుకోవాలి: VC

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 వార్షిక బడ్జెట్ రూ.718.86 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.796.45 కోట్లు, లోటు బడ్జెట్ రూ.44.68 కోట్లుగా ఉందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్స్ రూపంలో రూ.487.03 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడానికి, వర్సిటీలో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అదనపు గ్రాంట్లు అందించి వర్సిటీని ఆదుకోవాలని కోరారు.

News April 4, 2024

HYD‌లో నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు

image

GHMC పరిధి యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్, మల్కాజిగిరి, అంబర్‌పేట, రాంనగర్, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఉప్పల్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా లో ప్రెషర్ సమస్యలు ఏర్పడుతున్నాయని వాటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 4, 2024

టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ నరేష్ రెడ్డి

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.

News April 4, 2024

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్, వితౌట్‌ హెల్‌మెట్.. నోజాబ్!

image

చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, వితౌట్‌ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు.‌ న్యాయం చేయాలని వేడుకొన్నారు. 

News April 4, 2024

HYDలో మహాలక్ష్మి ఎఫెక్ట్.. తగ్గిన బస్‌ పాస్‌లు!

image

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహాలక్ష్మి స్కీమ్‌తో బస్‌‌పాస్‌లపై ప్రభావం పడింది. 2014 తర్వాత 4.50 లక్షలు ఉన్న పాస్‌ల సంఖ్య కరోనా తర్వాత 3.9 లక్షలకు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్‌ 9న FREE బస్‌ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఉచితం కావడంతో పాస్‌ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం నగరంలో 2,82,000 మంది బస్‌ పాస్‌లు వినియోగిస్తున్నట్లు TSRTC లెక్కలు చెబుతున్నాయి.

News April 4, 2024

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? మీ కోసమే!

image

HYD నుంచి ఇతర ప్రాంతాలకు, దేశంలోని వివిధ రైళ్లలో ప్రయాణించే వారికి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పలు సూచనలు చేశారు. ఏదైనా ప్రయాణానికి సంబంధించి తికమకపడినా, ఆందోళనకు గురైనా, రూటు తెలియకపోయినా, దొంగలను గుర్తించినా, ఎవరైనా వేధించినా, ఇతర ఏదైనా సమాచారం కోసం 139కు కాల్ చేయవచ్చని అధికారులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT