Hyderabad

News April 29, 2024

HYD: ఓయూ చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు

image

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొంటూ వేసవి సెలవులను ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇదీ ప్రభుత్వ తీరు‌ అంటూ మాజీ CM KCR విమర్శలకు దిగారు. తాజా ఉత్తర్వులపై సమాధానం చెప్పాలంటూ చీఫ్ వార్డెన్‌కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

News April 29, 2024

HYD: గౌలిపుర మాజీ కార్పొరేటర్‌ మృతి

image

టీఎస్​ఎస్​ పార్టీ గౌలిపుర డివిజన్​ మాజీ కార్పొరేటర్​ కె.శంకర్​ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శంకర్ మరణవార్త తెలుసుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు, దేవాలయాల ప్రతినిధులు పెద్దఎత్తున గౌలిపురలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శంకర్​ భౌతికకాయానికి నివాళులర్పించారు.

News April 29, 2024

HYD: పోలీసుల రైడ్స్‌.. బయటపడ్డ నోట్ల కట్టలు

image

లోక్‌సభ ఎన్నికల వేళ రాజధానిలో‌ పోలీసులు RAIDS చేస్తున్నారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సుమారు 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. వాహనాల్లో తరలిస్తున్న రూ. కోటి 97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, చందానగర్, నార్సింగి‌తో పాటు పలు ప్రాంతాల్లో ‌సరైన పత్రాలు లేని నగదును సీజ్‌ చేసినట్లు‌ పేర్కొన్నారు.

News April 29, 2024

HYD: ప్రాణాలు కాపాడిన పోలీస్‌కు సత్కారం

image

ట్యాంక్‌బండ్‌‌‌లో దూకి ఆత్మహత్యకు‌ యత్నించిన ఓ మహిళను TSSP కానిస్టేబుల్ అశోక్ కాపాడిన విషయం తెలిసిందే. అశోక్‌ అప్రమత్తత పట్ల అక్కడి వారు ప్రశంసలు కురిపించారు. సోమవారం TSSP అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా కానిస్టేబుల్ అశోక్‌‌ని కలిసి అభినందించారు. విధి నిర్వహణ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు.

News April 29, 2024

హైదరాబాద్‌ శివారులో చిరుత పులి (EXCLUSIVE)

image

హైదరాబాద్‌ శివారులో చిరుతపులి ఆనవాళ్లు‌ లభించాయి. శంషాబాద్ విమానాశ్రయం ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా‌‌ చిత్రీకరించిన ఫొటోల‌ను అధికారులు‌ విడుదల చేశారు. చిరుత కదలికలు రికార్డు అయ్యాయని వెల్లడించారు. ‘ఇప్పటికే‌ బోన్‌లను ఏర్పాటు చేశాము.. త్వరలోనే చిరుతపులిని బంధిస్తాం’ అని ఫారెస్ట్ అధికారి విజయానంద్ తెలిపారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.SHARE IT

News April 29, 2024

హైదరాబాద్‌: ఓయూలో నెల రోజులు బంద్

image

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లు, మెస్‌లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. వేసవి నేపథ్యంలో <<13137079>>మంచినీరు, విద్యుత్ కొరత <<>>ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. SHARE IT

News April 29, 2024

HYD: ఫోన్ మాట్లాడుతూ ఇంటిపై నుంచి కింద పడి బాలుడి మృతి

image

తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటిపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. హస్మత్‌‌పేటకు చెందిన రవీంద్ర (16) ఇంటి పైకెక్కి తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 29, 2024

HYD: కొత్తగా 14 లక్షల ఓటర్లు నమోదు

image

HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్‌లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 29, 2024

HYD: ‘బయటకు రావొద్దు’

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలపై భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం మృగవని పార్కు సమీపంలో 43.6 డిగ్రీలు, బంట్వారం మండలం నాగారంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

News April 29, 2024

గ్రేటర్ HYDలో 8,81,201 ఓట్ల తొలగింపు!

image

ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.