Hyderabad

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు.
SHARE IT

News April 2, 2024

హైదరాబాద్ నగరానికి గండిపేట నీళ్లు..!

image

HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.

News April 1, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

*కుటుంబ కలహాలతో జర్నలిస్టు రఘు ఆత్మహత్య
*స్నేహితుడిని చంపిన యువకుడి ARREST
*DAO, అగ్రికల్చర్ ఆఫీసర్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ విడుదల
*గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని మహిళా డెడ్ బాడీ
*గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న కిరాణా దుకాణంపై దాడులు
*లంగర్‌హౌస్ అట్టల గోదాంలో అగ్నిప్రమాదం
*శంషాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.37.5 లక్షలు సీజ్

News April 1, 2024

హైదరాబాద్: రోడ్ రోలర్ కింద సైలెన్సర్లు తుక్కుతుక్కు

image

నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు డబుల్ సైలెన్సర్ బిగించుకొని శబ్ద, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. నెలలోనే వెయ్యి సైలెన్సర్లను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ DCP సుబ్బారాయుడు తెలిపారు. వాటిని రోడ్డు రోలర్ తో తొక్కించి మళ్లీ పనికిరాకుండా చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను మోటర్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News April 1, 2024

సికింద్రాబాద్: ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ!

image

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

News April 1, 2024

HYD: ఇకపై ఆరు రోజులే గడువు..!

image

గ్రేటర్ HYDలో జీరో తదితర విద్యుత్తు బిల్లులను ఇక ప్రతి నెల ఆరో తేదీలోపు జారీ చేయాలని డిస్కం.. సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ 6వ తేదీన పూర్తి చేయాల్సిందేనని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలో గృహ, వాణిజ్య, ఇతరత్రా విద్యుత్తు కనెక్షన్లు 60 లక్షల దాకా ఉన్నాయి. గడువు రోజుకు పూర్తి చేయాలంటే సగటున రోజుకు 10 లక్షల బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది.

News April 1, 2024

శంకర్‌పల్లి: గుర్తు తెలియని మహిళ మృతి

image

గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. సోమవారం CI తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధి రామంతాపూర్‌లో గౌండ్ల పాండు గౌడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ(55) మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై ఆరెంజ్ క్రీమ్ కలర్ చీర, బ్లూ కలర్ జాకెట్ ఉన్నాయి. ఆహారం దొరకక, ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి మహిళ చనిపోయిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.9,54,200 సీజ్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

హైదరాబాద్‌లో కేటుగాళ్ల కొత్త మోసం ఇదే..!

image

HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 1, 2024

HYD: కుటుంబ కలహాలతో జర్నలిస్టు రఘు ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో ఈటీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న రఘు కుటుంబ కలహాలతో నేడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రాలేదు. జర్నలిస్టు మృతితో ఆయా సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.