Hyderabad

News April 28, 2024

HYD: భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

image

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్‌ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్‌ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 28, 2024

హైదరాబాద్‌ నుంచి విజయవాడ.. 10% డిస్కౌంట్

image

హైదరాబాద్-విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును RTC అందుబాటులో ఉంచిందని MD సజ్జనార్ తెలిపారు. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోందని, అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో tsrtconline.in రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది.

News April 27, 2024

KCRపై పంజాగుట్ట PSలో ఫిర్యాదు

image

మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో‌ ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదు‌లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 27, 2024

HYD: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రామస్వామి వివరాలు.. కార్వాన్ బంజావాడి ప్రాంతానికి చెందిన అంబటి శ్రీకాంత్ (36) కొంతకాలంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి చేసి బెట్టింగ్ కు సంబంధించిన రూ.22,900 స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 27, 2024

HYD: DDN విధానంలో ఏం చేస్తారు..?

image

HYD నగరంలో డిజిటల్ డోర్ నంబరింగ్ కోసం ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

News April 27, 2024

డిజిటల్ డోర్ నంబరింగ్‌పై GHMC కసరత్తు!

image

ఢిల్లీ లాంటి నగరాల మాదిరిగా HYD వ్యాప్తంగా డిజిటల్ డోర్ నంబరింగ్ (DDN) చేయడంపై GHMC కసరత్తు చేస్తోంది. 2018లో మూసాపేటలో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానంతో 7 అంకెలతో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించే కార్యక్రమం ప్రారంభించింది. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. DDN కేటాయించడం వల్ల ఇంటి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుంది. DDN కేటాయిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గతంలోనూ చెప్పారు.

News April 27, 2024

HYD: DDN విధానంలో ఏం చేస్తారు..?

image

HYD నగరంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ కై ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

News April 27, 2024

HYD: దంచి కొడుతున్న ఎండలు

image

HYD, RR ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శేరిలింగంపల్లి, హఫీజ్‌పేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, బంట్వారం మండలం తొర్మామిడి-నాగారంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. HYD వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 27, 2024

HYD: బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు.. అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SI నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సాయికిరణ్ అలియాస్ నాని (20) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కాచిగూడకు చెందిన ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. బాలికను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు.

News April 27, 2024

చేవెళ్ల: 17 మంది నామినేషన్ల తిరస్కరణ

image

చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 64 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్లమెంట్‌ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ ఆమోదం తెలిపారు.