Hyderabad

News April 1, 2024

HYD: 6 నుంచి దూరవిద్య పబ్లిక్ పరీక్షలు

image

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News April 1, 2024

HYD: RRR మార్గంలో మార్పులు!

image

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

News April 1, 2024

HYD: మల్లారెడ్డి VS మైనంపల్లి

image

మల్కాజిగిరిలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడిని నిలబెట్టి మల్లారెడ్డి గెలిపించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మైనంపల్లికి అధిష్ఠానం అప్పగించగా కచ్చితంగా గెలిపిస్తానన్నారు. అయితే మల్కాజిగిరిలో BRSను గెలిపిస్తానని ఇటీవల మల్లారెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 1, 2024

ఓయూ నూతన వీసీ ఎంపికపై కసరత్తు

image

ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

News April 1, 2024

HYD: ఆస్తి పన్ను రూ.1914.87 కోట్లు వసూలు

image

ఆస్తి పన్ను వసూళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలం మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్‌ను కమిషనర్ ఖరారు చేయగా.. దాదాపుగా రూ.1914.87 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 90 శాతం వడ్డీ
రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకొచ్చారు. అయినా కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై మీ కామెంట్.

News April 1, 2024

HYD: 50 శాతం జరిమానాతో ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ

image

గ్రేటర్‌ HYD పరిధిలో ఏప్రిల్‌ 1 నుంచి ట్రేడ్ లైసెన్స్‌లను పునరుద్ధరిస్తే రెన్యువల్‌ దరఖాస్తులపై అదనంగా 50 శాతం అపరాద రుసుం ఉంటుందని GHMC అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 31తో ట్రెడ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిందని, జనవరి 31 వరకు అవకాశం ఇచ్చామని, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం జరిమానాతో పునరుద్ధరించినట్లు చెప్పారు. ట్రేడర్లు తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోకుంటే జరిమానాలు ఉంటాయన్నారు.

News April 1, 2024

HYD: అదనంగా మరో 87 ట్యాంకర్లు..

image

గ్రేటర్ HYDలో తాగునీటి సమస్యను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా 5వ తేదీ నాటికి మరో 87 ట్యాంకర్లు అదనంగా సమకూర్చుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.

News April 1, 2024

హైదరాబాద్ @ 38.2 డిగ్రీలు నమోదు

image

హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో రాగల రెండు, మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2024

HYD: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.

News April 1, 2024

HYD: నేటి నుంచి కొత్త అటెండెన్స్‌ సిస్టం అమలు

image

జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో అక్రమాలకు శాశ్వత చెక్‌ పెడుతూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్మికుల అటెండెన్స్‌లో ప్రస్తుతం అమలవుతున్న ఫింగర్‌ ప్రింట్‌ బయోమెట్రిక్‌ హాజరును నేటి నుంచి నిలిపివేయనున్నారు. సోమవారం నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ సిస్టంను అమలు చేయనున్నారు.