India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ డెవలప్‌మెంట్ బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో MP అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరిస్తామని CM హామీ ఇచ్చారు. ఇక్కడి భూముల విలువను పెంచుతామన్నారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ MP అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ఠ ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత, సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్ దాఖలు చేశారు. వారసిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయం చేయడం లేదని, అందుకోసమే తాను నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. సామాన్యుడినైనా తనను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పారు.
HYD నగర శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్లే దారిలో మృగవని నేషనల్ పార్క్ ఉంది. దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జాతీయ పార్కులో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాత్రి పూట నేచురల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి వేళ సమ్మర్ టూర్లతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. చల్లటి గాలులు, పచ్చటి అందాల మధ్య నేచురల్ క్యాంప్ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.
నెహ్రూ జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు కొనసాగుతుందన్నారు. నాలుగో తరగతి నుంచి పై విద్యార్థులకు జూకు సంబంధించిన జంతువులు, వాటి ఆవాసాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్నాక్స్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 అని చెప్పారు.
HYD నగరంలో వర్షాకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి.మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీముల్లో షిఫ్టుల వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. వివిధ సాధనాలతో నీటిని తొలగించడం లాంటి పనులు నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. హైదర్‌గూడకు చెందిన విద్యార్థి(16)ని ఇంట్లో క్షణికావేశంలో ఉరేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం నేటి అర్ధరాత్రి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. HYD నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, సంక్షేమంగా ప్రయాణించాలని కోరారు. SHARE IT
Sorry, no posts matched your criteria.