Hyderabad

News April 25, 2024

శంషాబాద్: ఏడాదిలో 2.5 కోట్ల మంది ప్రయాణం!

image

2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2.5 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. 2018-19 లో 2.1కోట్ల మంది ప్రయాణించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2023-24 లో 1.76 లక్షల విమాన సర్వీసులు రాకపోకలు సాగించాయి. అదే విధంగా 2023-24 లో 1.54 లక్షల మెట్రిక్ టన్నులు కార్గో సేవలను నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

News April 25, 2024

HYD: బాలికపై బైక్‌ మెకానిక్ అత్యాచారం

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత కఠిన కారాగార శిక్ష విధించినట్లు లంగర్‌హౌస్ CI రఘుకుమార్ తెలియజేశారు. 2021 సంవత్సరంలో లంగర్‌హౌస్‌లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉండే అతిక్ ఖాన్ అనే బైకు మెకానిక్ బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. మంగళవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ కోర్టు అడిషనల్ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

News April 25, 2024

ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ <<13106495>>యువకుడిని మృత్యువు<<>> వెంటాడింది. మేడిపల్లిలోని సత్యనారాయణపురానికి చెందిన మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతుల కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. మంగళవారం నారాయణగూడలోని ఓ బ్యాంకులో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు బైకుపై బయలుదేరాడు. నల్లచెరువు ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. వెనక నుంచి వచ్చిన బస్సు మీది నుంచి వెళ్లగా మృతి చెందాడు.

News April 25, 2024

HYD: 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,32,858 మంది, ద్వితీయ సంవత్సరం 2,10,629 మంది పరీక్షలు రాశారు. మొత్తం 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

HYD: 15 లక్షల మంది ఓటర్లు పెరిగారు!

image

HYD నగరం వేగంగా విస్తరిస్తున్నట్లుగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గ్రేటర్ HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అధికారుల అంచనా.

News April 25, 2024

HYD: నగర ప్రజలకుముఖ్య గమనిక

image

GHMC పరిధి ప్రజలకు ముఖ్య గమనిక. ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్ ముందు పైపుతో కడగొద్దు. బకెట్‌తో‌ నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు నుంచి నీరు వరద మాదిరిగా బయటకి రావొద్దు. ఆ విధంగా వచ్చినా, నీటి వృథా చేసినా GHMC/మున్సిపల్ వారు ఆ ఇంటికి రూ.5వేల జరిమానా వేస్తారు. ఎవరికి తెలియకుండానే ఉదయం ఫొటో తీయడం జరుగుతుందని హెచ్చరించారు. నీటిని ఆదా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 25, 2024

ఎంటైర్ హైదరాబాద్‌ మాతో ఉంది: KCR

image

ఎంటైర్ హైదరాబాద్‌ మాతో ఉందని మాజీ CM KCR అన్నారు. ఓ ఛానెల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు నమ్మిన పల్లె ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని పేర్కొన్నారు. HYD మేథావులు‌ BRS వైపే ఉన్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఇప్పటికే సికింద్రాబాద్‌‌లో గెలిచేశామని, ఎందుకంటే అక్కడ నిలబడ్డది టి.పద్మారావు అని భరోసా‌ వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.

News April 25, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> బంజారాహిల్స్ నందినగర్‌లో శిశువు మృతదేహం లభ్యం
> నగరంలో వైభవంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర
> బహదూర్ పల్లిలో మెకానిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం
> మెడికల్ షాప్స్‌పై ఔషధ నియంత్రణ సంస్థ అధికారుల దాడి
> ఉప్పల్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> బాలికను గర్భవతిని చేసిన యువకుడు అరెస్టు

News April 25, 2024

HYD: సినిమా యానిమేషన్ స్టోరీ రైటర్ సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక సినిమా యానిమేషన్ స్టోరీ రైటర్ దాసరి లలిత సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పీఎస్ పరిధి పంచవటి కాలనీలోని విక్రమ్ హైట్స్‌లో నివాసముంటున్న ప్రశాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అప్పులబాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

News April 24, 2024

HYD: దుండిగల్‌లో మహిళ దారుణ హత్య

image

హైదరాబాద్ శివారు దుండిగల్ PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం ఈడ్చుకెళ్లి గొయ్యిలో పారేశారు. మృతురాలు సక్కుబాయి (44) అడ్డా కూలీగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుమారుడు శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.