India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్థిగా నివేదిత మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నాయకులతో కలిసి RO మధుకర్ నాయక్‌కు పత్రాలు అందజేశారు. తన తండ్రి చేసిన అభివృధి, BRS ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో HYDకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.
HYD జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల విధుల కోసం నియమితులైన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వెల్లడించారు. చాదర్ ఘాట్‌లోని విక్టరీ క్రీడా ప్రాంగణంలో తాజాగా రెండో దశ ర్యాండమైజేషన్ పూర్తయిందని, తదనంతర ప్రక్రియలో భాగంగా వాటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విభజించి, 15 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు.
చేవెళ్ల BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు.. జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతంగా వాహనాలు లేకపోగా.. ఆయన భార్యకు 4 కార్లు ఉన్నాయి. వీరి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30 లక్షల అప్పు ఉంది.
HYD నగరంలో కల్తీ లేని పదార్థమే లేదన్నట్టుగా పరిస్థితి మారింది. HYD టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం చేపట్టిన తనిఖీల్లో హబీబ్‌నగర్ పరిధిలో పాలలో అమ్మోనియం సల్ఫేట్ రసాయనాన్ని కలిపి చిక్కగా ఉండేలా చేసి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. చిక్కటి బర్రె పాలు పితికి వెంటనే అందిస్తున్నామని కవర్లలో విక్రయిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలు కొనేటప్పుడు జర జాగ్రత్త..!
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ (21) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి నిరాకరించాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
HYD నగరంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. త్వరలో అగ్నిమాపక శాఖకు 18 చిన్న శకటాలు తెస్తామని తెలిపారు. మరోవైపు ఐదు ఫైర్ ఫైటింగ్ రోబోలు రానున్నాయని, వరద బాధితులను రక్షించేందుకు మానవ రహిత రిమోట్ లైఫ్ బాయ్స్ అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. HYD నగరం సహా రాష్ట్రవ్యాప్తంగా నూతన సంస్కరణలకు శ్రీకారం చూడతామన్నారు.
✓సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ: గాల్ బ్లాడర్, క్లోమగ్రంథి, కాలేయం, పేగులు, అన్నవాహిక అవయవాల్లో క్యాన్సర్ ఇతర కణుతులు ✓యురాలజీ మూత్రకోశం, ప్రొస్టేట్, కిడ్నీ, కిడ్నీ నుంచి వెళ్లే ట్యూబ్ బ్లాకేజ్‌లు, పెల్విస్, ఆడ్రీనల్ గ్రంథుల్లో క్యాన్సర్ కణుతులు ✓సర్జికల్ అంకాలజీ: గర్భసంచి, అండాశయం, పేగులు ఇతర క్యాన్సర్లు •పై వాటికి NIMSలో రోబో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.