Hyderabad

News April 22, 2024

నా గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

image

కొందరు ప్రశ్నించినంత మాత్రాన ఆ పార్టీలకు జవాబు చెప్పే అవసరం లేదని ప్రజలకు, మీడియాకే చెప్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే రాలేని వారు మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వారసిగూడలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సీతాఫల్ మండి మీదుగా జీప్ ప్రచార యాత్రను కిషన్ రెడ్డి చేపట్టారు.

News April 22, 2024

HYD: ఇప్పటివరకు రూ.14.63 కోట్ల నగదు స్వాధీనం

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.5.88 లక్షలు పట్టుబడినట్టు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.14.63 కోట్ల నగదు, రూ.6.90 కోట్ల విలువైన వివిధ వస్తువులు, 20,920 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 208 మందిపై కేసులు నమోదు కాగా..
206 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.

News April 21, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> రామంతపూర్ కట్టమైసమ్మ ఆలయంలో చోరీ
> లాలాపేటలో ఇంటింటికి BJP బొట్టు కార్యక్రమం
> కీసరలో స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టిన కారు
> జీపు యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి
> ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శన
> నగర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం
> ఆసిఫ్‌నగర్‌లో‌ పోలీసులు కార్డెన్‌ సెర్చ్
> లాలాపేటలో ఇంటింటికి BJP బొట్టు కార్యక్రమం
> ప్రశాంతంగా ముగిసిన TSRJC ఎంట్రెన్స్ పరీక్ష

News April 21, 2024

HYD: ఘోరం.. రెండు ముక్కలైన శరీరం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్ ద్విచక్ర వాహనంపై కేశంపేట బైపాస్ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

కూకట్‌పల్లిలో‌ దారుణం.. అత్యాచారం చేసి హత్య?

image

హైదరాబాద్‌లో దారుణఘటన వెలుగుచూసింది. ఆదివారం కూకట్‌పల్లి PS పరిధి AR పైప్ వర్క్ షాప్ సెల్లార్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. విష్ణు ప్రియ లాడ్జి సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి 45 ఏళ్లు ఉంటాయని సమాచారం.

News April 21, 2024

HYD: మానవత్వం చాటిన CI

image

నారాయణగూడ CI మానవత్వం చాటుకున్నారు. ఆదివారం TSRJC పరీక్ష రాయడానికి నల్గొండ నుంచి విద్యార్థిని వైష్ణవి నారాయణగూడకు చేరుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక పరీక్షా సెంటర్‌ అంబర్‌పేటలోని ప్రభుత్వం బాయ్స్‌ స్కూల్ అని తేలియడంతో‌ రోడ్డు వెంబడి కంగారుగా‌ బయల్దేరింది. ఇది గమనించిన CI చంద్రశేఖర్‌ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని 2 నిముషాల ముందే సెంటర్ వద్దకు చేర్చి, ఆదర్శంగా నిలిచారు.  

News April 21, 2024

HYD: సైబర్ ముప్పు తప్పించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్!

image

ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజల వివరాలను డేటా రూపంలో భద్రపరిచే సంస్థల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముప్పు తప్పించేందుకు HYD తార్నాకలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కూకట్‌పల్లి జేఎన్టీయూల్లో కొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు పరిశోధనలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

News April 21, 2024

HYD: తొమ్మిదేళ్లలో రూ.1,110 కోట్లు

image

HMDA, GHMC పరిధిలో తొమ్మిదేళ్లలో హరితహార కార్యక్రమం కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయా శాఖలు వెల్లడించాయి. రెండిటి పరిధిలో దాదాపు రూ.1,110 కోట్లు ఖర్చు పెట్టాయి. HMDA రూ.974.85 కోట్లు,GHMC రూ.136.13 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొంది. వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించింది.

News April 21, 2024

HYD: మద్యం తాగడంతో వాంతులు.. యువకుడి మృతి

image

మద్యం తాగిన యువకుడు వాంతులు చేసుకొని మృతి చెందిన ఘటన HYD గచ్చిబౌలి పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన సీమంత దత్తా 2 నెలల క్రితం గచ్చిబౌలికి వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కేశవ్ నగర్‌లో ఉన్న సీమంత దత్తాని రూమ్‌మేట్ ప్రభాకర్ వెళ్లి చూడగా మద్యం తాగి వాంతులు చేసుకున్నాడు. రూమ్‌కి వెళ్దామనగా తర్వాత వస్తానన్నాడు. తిరిగి వచ్చి చూడగా మృతి చెందాడు.

News April 21, 2024

HYD: ఆదివారం ఆస్తి పన్ను వసూలు

image

ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, నెలాఖరుతో పథకం ముగుస్తున్నందున ఆదివారం పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని ఆయన వెల్లడించారు.