Hyderabad

News April 20, 2024

షకీల్ కొడుకు రాహిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. అధికారులు సస్పెండ్

image

బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.

News April 20, 2024

HYD: డిగ్రీ పరీక్షలో ఫెయిల్.. రివాల్యుయేషన్లో 90% పైగా మార్కులు!

image

HYD నగరంలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో పది మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం తొలి సెమిస్టర్లో ఒక్కో సబ్జెక్టులో ఫెయిలయ్యారు. రీవాల్యుయేషన్లో వారే తొంభై శాతానికి పైగా మార్కులతో పాసయ్యారు. ఉస్మానియా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో కొందరు ఫస్టియర్ విద్యార్థుల అనుభవమిది. రెగ్యులర్ పరీక్షలో ఫెయిలై రీవాల్యుయేషన్లో పాసయ్యారంటే మూల్యాంకనంలోనే లోపాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News April 20, 2024

మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ బోణి కొట్టనుందా?

image

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టనుందా? ఇప్పటివరకు BRS పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, 2014లో బీజేపీ+టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, 2019లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు. 2024లో గెలుస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

News April 20, 2024

హైదరాబాద్‌లో దంచి కొడుతున్న ఎండలు

image

HYD నగరంలో ఎండ దంచికొడుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శుక్రవారం మూసాపేట్, కేపీహెచ్బీ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులురలో 42.9, బన్సీ తెలిపారు. యాకుత్పులాల్ పేట్ 42.7, షేక్పేట్ 42.7, కూకట్పల్లి 42.7, మలక్పేట్ 42.5, మియాపూర్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

News April 20, 2024

HYD: ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

సెల్ ఫోన్ అతిగా వాడొద్దన్నందుకు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ వివరాల ప్రకారం.. కిషన్ బాగ్‌కు చెందిన అశుతోష్ జాదవ్(17) ఇంటర్ చదువుతున్నాడు. రోజూ గంటల కొద్దీ ఫోన్లో గడుపుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.

News April 20, 2024

HYD: 897 మంది లైసెన్స్ ఆయుధాల డిపాజిట్

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల పై బెదిరింపులకు పాల్పడకుండా ఉండేందుకు లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేసే డిపాజిట్ చేయాలని సూచించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో 897 మంది లైసెన్స్ ఆయుధాల డిపాజిట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

News April 20, 2024

HYD: దీర్ఘకాలిక సెలవులు రద్దు.. రోనాల్డ్‌ రాస్‌

image

వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్టు
చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాలకు శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశించారు.

News April 20, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

News April 20, 2024

HYD: తెలంగాణ ఖ్యాతిని చాటిన తెలుగు తేజాలు

image

కరీంనగర్ వాసి పీచు నరేశ్ రెడ్డి, హైదరాబాద్ వాసి దండుగుల వెంకటేశ్‌లు నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపులో 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారు. వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను వారు ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని ఈ తెలుగు తేజాలు పేర్కొన్నారు.

News April 19, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల
> విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
> చిలుకూరు బాలాజీ టెంపుల్ కి క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
> KPHBలో రూ.లక్ష నగదు సీజ్ చేసిన పోలీసులు
> రోడ్డు ప్రమాదంలో సరూర్ నగర్ PS కానిస్టేబుల్ మృతి
> HYD సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
> సనత్ నగర్‌లో కాంగ్రెస్ కార్యకర్త మృతి
>బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులఅరెస్ట్