India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాహనదారులు మీకో బ్యాడ్ న్యూస్. రాంగ్ రూట్‌లో వెళ్తే ఏం కాదని లైట్ తీసుకుంటే మాత్రం మీ పై ఐపీసీ 336 కింద కేసు నమోదవ్వడం ఖాయమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్ రూట్లో ప్రయాణించిన 23 మంది వాహనదారులు, ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజు రోజుకీ రద్దీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ లిస్ట్ విడుదల చేశారు. ఏప్రిల్ 21 నుంచి జూన్ వరకు పలు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుకున్నారు. మోమిన్ పేట్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నవాబుపేట ఎస్సై భరత్ భూషణ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.1 కోటి 5 లక్షల నగదు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
రోజు రోజుకి 1930 సైబర్ హెల్ప్ లైన్ కాల్స్ పెరగటం, లైన్ బిజీ రావటం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేసి, వెంటనే స్పందించేందుకు ప్రతి స్టేషన్ పరిధిలోని సైబర్ యోధులకు(సైబర్ క్రైమ్ కానిస్టేబుల్) ప్రత్యేక సెల్ ఫోన్లు అందిస్తున్నారు. HYD, RR, MDCL, VKB జిల్లాలోనూ ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే వికారాబాద్‌లోని పలు స్టేషన్లలో అందజేశారు. 1930కు కాల్ చేసిన వెంటనే స్పందించి, సైబర్ నేరాలపై చర్యలు తీసుకోనున్నారు.
హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. భాగ్యనగర్ కేంద్రంగా వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో ఈనెల 23న హనుమాన్ జన్మోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
బ్లాక్‌లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో రవీందర్ నాయక్ ఒకరు. రాష్ట్రంలో గిరిజనులను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రేస్‌కు మరింతగా కలిసి రానుంది.
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ ఉన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. మరోసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.