India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జువైనల్ హోమ్(బాలికల సదన్) నుంచి ఓ బాలిక పారిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన హనుమంతు కుమార్తె ప్రియగిరి(17)ని కాచిగూడలోని బాలికల సదన్‌కు 2023 జనవరిలో తీసుకువచ్చారు. మంగళవారం బాలికల సదన్ నుంచి గోడ దూకి పారిపోయింది. సూపర్ వైజర్ సావిత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ప్రియులకు ‘HYD క్రికెట్ అసోసియేషన్’ శుభవార్త తెలిసింది. ఇప్పటికే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ‘HCA అధ్యక్షులు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈనెల 18 వరకు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn.html వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. SHARE IT
HYD నగరంలోని ఖైరతాబాద్ RTA కోడ్ TG 09తో ప్రారంభమై 4 అంకెల నెంబర్లతో ముగుస్తుంది. ప్రతి RTA కార్యాలయం పరిధిలో తొలి 10 వేల నెంబర్లను ఇలానే అందించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మధ్యలో, ఆంగ్ల అక్షరాలతో సిరీస్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా HYD నగరంలో వివిధ RTA కార్యాలయాల పరిధిలో ఆంగ్ల అక్షరాలు లేకుండానే వాహనాల నెంబర్ ప్లేట్లు వస్తున్నాయని ప్రజలు అనటం పై అధికారులు స్పందించారు.
మాజీ MP మందా జగన్నాథ్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. BSP అధినేత్రి మాయావతిని దిల్లీలో రేపు కలవనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ MP బరిలో ఉంటారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, KCR కంటే రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలలుగా CMతో మాట్లాడేలా ప్రయత్నిస్తే EX MLA సంపత్ కుమార్ దూరం పెట్టారని సమాచారం.
వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతి, IAS, 2022-23 వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిపాలనపై పట్టు సాధించి భవిష్యత్తులో ప్రజలకు ఉన్నత సేవలు అందించి మంచి పేరు సంపాదించేలా కృషి చేస్తానని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు.
భారతదేశంలో మొట్ట మొదటి ప్యాసింజర్ ట్రైన్ 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి థానే వరకు వెళ్లేందుకు ప్రారంభమైనట్లు HYD సికింద్రాబాద్ SCR అధికారులు X వేదికగా తెలిపారు. 171 ఏళ్ల సర్వీస్ అందించిన ట్రైన్ తీపి జ్ఞాపకాలు కోట్లాదిమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. రవాణా చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్పెషలైజేషన్ల ఎంఫార్మసీ(సీబీసీఎస్) సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
అర్ధరాత్రులు రోడ్లపై సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి డబ్బు, నగలు దోచుకుంటున్న ఐదుగురిని లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జి CI రమేశ్ మాట్లాడుతూ.. మల్కాజిగిరిలోని BJR నగర్‌కు చెందిన మహ్మద్ తౌసిఫ్ లియాస్ గోడా(19), నలుగురు మైనర్ స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్, చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డిలు పోలీసులను అభినందించారు.
రేపటి శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.