India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.SHARE IT
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్డ్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్ పొందవచ్చని కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. GHMC పరిధి ప్రజలు సద్వినియోగం చేసుకోండి.
SHARE IT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్ వాటర్‌ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.
కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో విషాదం నెలకొంది. సోమవారం రమేశ్ (20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్‌ను తీసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్‌తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసి నకిలీ టికెట్‌గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అరెస్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో కూతురు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్(29) తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్ నుమా కారిడార్లలో ప్రస్తుతం రోజుకు 76 MMTS రైళ్లు నడుస్తన్నాయి. వాటిలో గరిష్ఠంగా 45 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. MMTS రైళ్లు దిగిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా MMTS, బస్ పాస్ రూ.1,350 అందుబాటులోకి తెచ్చారు. తద్వారా గ్రేటర్‌లో రోజుకు సుమారు 8 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
NCRB-2022 నివేదిక ప్రకారం దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదయ్యాయి. వాటిలో 246 కేసులు HYD ప్రాంతానికి చెందినవే అంటే తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. HYD నగరంలో అల్లం, వెల్లుల్లి, టమాటా సాస్, మామిడి కాయలు, కూల్ డ్రింక్స్, ఫేస్ క్రీమ్ ఇలా కోకొల్లలుగా కల్తీ చేసే విక్రయిస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ అని గుర్తిస్తే తెలపాలన్నారు.
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని కారు ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి టెక్ మహీంద్రాయూనివర్సిటీకి చెందిన మేఘాంశ్‌గా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు సాయి మానస్, శ్రీ చరణ్ రెడ్డి, అర్నవ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు HYD శివారులోని ఇక్రిశాట్ కృషి చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అప్లోటాక్సిన్-ఆస్పిరిజెల్లాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. తద్వారా రైతులు పంట పండించే ఖర్చు సైతం తగ్గుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.