Hyderabad

News March 21, 2024

హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

image

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.

News March 21, 2024

రాజధానిలో లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే..!

image

*సికింద్రాబాద్‌: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.

News March 21, 2024

HYD: వైద్యంలో డ్రోన్ టెక్నాలజీ.. ఇక సులభం!

image

HYDలోని ICMR, JNTU ఆచార్యులు వైద్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించారు. రాజధాని సహా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త, మూత్ర నమూనాలను డ్రోన్స్ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఒక్కోటి 60-75 KM దూరాన్ని చేరుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందించామని, ముగ్గురు డ్రోన్ పైలెట్లు వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాధార మందులను సైతం పంపిస్తున్నట్లు తెలిపారు.

News March 20, 2024

BREAKING: HYD: క్రిశాంక్‌పై కేసు నమోదు

image

BRS పార్టీ నేత, TSMDC మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేసినట్లుగా HYD మాదాపూర్ పోలీసులు తెలిపారు. Xలో ఫేక్ పోస్ట్ పెట్టినందుకుగాను సీఆర్పీసీ అండర్ సెక్షన్ 41(a) కింద బుధవారం నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు క్రిశాంక్ మొబైల్ సైతం సీజ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

News March 20, 2024

ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో HERO అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.

News March 20, 2024

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై GHMC స్పెషల్ ఫోకస్..

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ విల్లాలు, దుండిగల్ ఓ ఇంజినీరింగ్ కాలేజీ కూల్చివేత, బోడుప్పల్, ఘట్‌కేసర్, బండ్లగూడ జాగీర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను ఇటీవల నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణం కనిపిస్తే కూల్చివేస్తామని GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.

News March 20, 2024

HYD: ఈటలకు జనసేన మద్దతు ప్రకటన 

image

BJP మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముమ్మడి ప్రేమ్‌కుమర్ ప్రకటించారు. ఈరోజు ఈటలను ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. BJP అభ్యర్థి ఈటలను గెలిపించేందుకు జనసేన కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. BJP, జనసేన శ్రేణులు కలిసి ఈటలను తప్పకుండా గెలిపిస్తాయన్నారు.   

News March 20, 2024

HYD: యువ శాస్త్రవేత్త కావాలని ఉందా..? నేడే లాస్ట్..!

image

యువ శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో యువిక పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు HYD DEO రోహిణి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని, దరఖాస్తు తర్వాత ఇస్రో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని,మార్చి 28న ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా ఇస్రో విడుదల చేస్తుందన్నారు. వెబ్‌సైట్ jigyasa.iirs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 20, 2024

HYD: సమ్మర్ క్యాంపులు.. 2023లో వచ్చిన ఫీజు ఎంత..?

image

GHMC 2023లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులలో ఎల్బీనగర్ నుంచి రూ.31,030, చార్మినార్- రూ.1,05,680, ఖైరతాబాద్- రూ.1,72,600, శేర్లింగంపల్లి- రూ.81,240, కూకట్‌పల్లి- రూ.74,840, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి- రూ.1,11,220 ఫీజు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

News March 20, 2024

HYD: ఈ చిన్నారి GREAT

image

HYD చందానగర్‌ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.