Hyderabad

News March 20, 2024

HYD: విషాదం.. ఇద్దరి ప్రాణం తీసిన చేపల వేట..!

image

హైదరాబాద్‌ శివారులో బుధవారం విషాదఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2024

HYD: కుక్కల బెడద.. నియంత్రణ ఎక్కడ..?

image

HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News March 20, 2024

హైదరాబాద్‌‌లో TAX కట్టకుంటే LOCK..!

image

ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

News March 20, 2024

HYD: కంటోన్మెంట్‌ ఉపఎన్నిక.. కీలక మలుపు

image

లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ HYDలో కాంగ్రెస్‌ బలాన్ని పెంచుకుంటోంది. నిన్న మధ్యాహ్నం వరకు BJP కార్యక్రమాల్లో పాల్గొన్న కంటెస్టెడ్ MLA శ్రీగణేశ్.. ఎవరూ ఊహించని విధంగా సాయంత్రమే హస్తం కండువా కప్పుకొన్నారు. కంటోన్మెంట్ INC టికెట్ దాదాపు ఆయనకే ఖరారైందని టాక్. మరోవైపు BRS టికెట్ తనకే ఇవ్వాలని సాయన్న కూతురు నివేదిత అడుగుతున్నారట. ఇక BJP అభ్యర్థి ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

News March 20, 2024

HYD: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి

image

HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరు‌ను జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 20, 2024

హైదరాబాద్‌‌లో మొదలైన సందడి..!

image

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

News March 20, 2024

మల్కాజిగిరిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

image

మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.

News March 19, 2024

HYD: ప్రజాపాలన సేవా కేంద్రాలు బంద్..

image

HYDలో గృహ జ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ జీరో బిల్ రాని వారి సమస్యలను పరిష్కరించడం కోసం GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా, ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రజా పాలన సేవా కేంద్రాలు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, మల్కాజిగిరి డీసీ రాజు తెలిపారు.

News March 19, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> నాంపల్లిలో వ్యక్తి మృతి
> రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీపై నైపుణ్య శిక్షణ
> రియల్ ఎస్టేట్ పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
> మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
> ఓయూ పీఎస్ పరిధిలో పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి
> నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా ARREST
> చందానగర్‌లో కారులో మంటలు
> జీడిమెట్ల‌లో 9వ అంతస్తు నుంచి పడి ఒకరి మృతి
> సీ&డీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: రోనాల్డ్ రోస్